గాలె: శ్రీలంక–ఎతో జరుగుతున్న అనధికార టెస్ట్‌లో ఇండియా–ఎ జట్టు భారీ స్కోరు సాధించింది. ధ్రువ్ జురెల్ (141 నాటౌట్), సాయి సుదర్శన్ (132) సెంచరీలు చేయడంతో 333/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌ను 111.4 ఓవర్లలో 452/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
షేక్ రషీద్ (63), హర్ష్ దూబే (30) రాణించారు. చామిక గుణశేఖర 3 వికెట్లు తీశాడు. తర్వాత లంక ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 113/2 స్కోరు చేసింది. నువానిద్ ఫెర్నాండో (65 నాటౌట్), ఆషెన్ బండార (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పవాంతా వారాసింగే (11), నిరోషన్ డిక్వెల్లా (10) నిరాశపర్చారు. ప్రస్తుతం లంక ఇంకా 339 రన్స్ వెనకబడి ఉంది.
