పీసీసీఎఫ్గా వినయ్కుమార్.. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

పీసీసీఎఫ్గా వినయ్కుమార్.. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • 30న ముగియనున్న ప్రస్తుత పీసీసీఎఫ్ సువర్ణ పదవీ కాలం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్​-హెచ్ఓఎఫ్ఎఫ్)గా వినయ్​కుమార్ నియామకం అయ్యారు. 1992 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం పీసీసీఎఫ్ గా కొనసాగుతున్న సువర్ణ పదవీకాలం ఈ నెల 30 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వినయ్ కుమార్ ను నియమించగా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు. ఈయన గతంలో అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారు.

ఆదిలాబాద్ డీపీఏపీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్​గా పనిచేయడంతో పాటు ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన ఈయన... వరల్డ్ బ్యాంక్, జైకా సహకారంతో అమలైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు.

ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ అటవీ సంరక్షణకు చర్యలు చేపడుతానని, నిబద్ధతతో బాధ్యతలను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతకు  ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.