Sunitha Vs Chinmayi: 'నా శరీరం- నా ఇష్టం' వివాదం.. చిన్మయి విమర్శలపై సింగర్ సునీత ఫైర్!

Sunitha Vs Chinmayi: 'నా శరీరం- నా ఇష్టం' వివాదం.. చిన్మయి విమర్శలపై సింగర్ సునీత ఫైర్!

టాలీవుడ్ టాప్ సింగర్స్ సునీత, చిన్మయి శ్రీపాద మధ్య చెలరేగిన సోషల్ మీడియా వార్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'నా శరీరం-నా ఇష్టం' అనే కాన్సెప్ట్‌పై సునీత ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించడంతో.. లేటెస్ట్ గా సునీత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా నేరుగా చిన్మయి పేరు ప్రస్తావిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. ఫెమినిజం అంటే కేవలం నచ్చిన బట్టలు వేసుకోవడం, సిగరెట్లు తాగడం కాదు అని అభిప్రాయపడ్డారు. మహిళలు 'నా శరీరం నా హక్కు' అన్నప్పుడు.. ఈ సమాజం ఇంకా ఎదగలేదు కాబట్టి అవతలివాడు కూడా 'నా కళ్ళు నా ఇష్టం'  అంటాడు. మనల్ని మనం సేఫ్‌గా ఉంచుకోవడం ముఖ్యం అని చెప్పారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. ఇంతటి ప్రభావం ఉన్న మహిళలు ఇలా మాట్లాడటం సమాజంలో మగవారికి కరపత్రాలుగా మారడమేనంటూ విమర్శించారు. మహిళలకు తమ శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా వారిదేనని అభిప్రాయపడ్డారు.

సునీత పవర్‌ఫుల్ రిప్లై..

చిన్మయి విమర్శలకు సునీత అంతే గట్టిగా సమాధానమిచ్చారు. చిన్మయి.. సింగర్‌గా నీపై నాకు గౌరవం ఉంది. నేను తప్పుగా అర్ధం చేసుకున్నానని అన్నావు కాబట్టి చెప్తున్నా.. 'మై బాడీ మై విష్' అంటే ఏంటో నాకు బాగా తెలుసు. అది ఎవరి కంట్రోల్‌లోనూ ఉండకూడదు. నేను చెప్పింది సమాజంలోని చేదు నిజం గురించి  అని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో ఫతేపూర్ లో ఒక మహిళను బైక్‌పై లాకెళ్లడానికి ప్రయత్నించిన సంఘటన వీడియోను ప్రస్తావిస్తూ నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సునీత మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు.  ఎవడైనా 'నా చెయ్యి నా ఇష్టం' అని మహిళలపై చెయ్యి వేస్తే.. పబ్లిక్‌లోనే వాడి చేతులు విరగ్గొట్టాలి. అలాంటి వాళ్ల చేతులు విరగ్గొట్టడంలో నేనే మొదటి వరుసలో ఉంటా. నేను కూడా జీవితంలో ఎన్నో అనుభవించాను.. పూర్తి వీడియో చూడకుండా మాట్లాడకండి అంటూ సునీత సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు టాలెంటెడ్ సింగర్స్ మధ్య జరుగుతున్న ఈ డిబేట్ సోషల్ మీడియాలో నెటిజన్లను రెండు వర్గాలుగా చీల్చేసింది.