Today OTT Movies: ఈ వీకెండ్కు ఓటీటీ ఫుల్ మీల్స్.. ఇవాళ ఒక్కరోజే 20కి పైగా కొత్త సినిమాలు

Today OTT Movies: ఈ వీకెండ్కు ఓటీటీ ఫుల్ మీల్స్.. ఇవాళ ఒక్కరోజే 20కి పైగా కొత్త సినిమాలు

ఈ వీకెండ్కి థియేటర్లో కొత్త సినిమాల దర్శనం కరువయ్యింది. గడిచిన రెండు వారాల్లో రిలీజైన సమంత  ‘మా ఇంటి బంగారం’, శుభం హీరో నటించిన  ‘దీవానా’, వరుణ్ ధావన్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’.. ఈ మూడు సినిమాలతోనే వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ చప్పగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేమున్నాం అంటూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది.

ఇవాళ శుక్రవారం (జూన్ 26న) ఒక్కరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్, రొమాన్స్, కామెడీ, హారర్, హిస్టారికల్ ఇలా అన్ని జోనర్లలోనూ ప్రేక్షకులను అలరించే కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి. 

నెట్‌ఫ్లిక్స్

బాహుబలి: ది టార్చ్‌బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ)

రాజా శివాజీ (మరాఠీ హిస్టారికల్ బయోగ్రాఫికల్ యాక్షన్)

లిటిల్ బ్రదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ)

క్రిస్ అండ్ మార్టినా: ది ఫైనల్ సెట్ (స్పోర్ట్స్ డాక్యుమెంటరీ)

ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్)

నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (తెలుగు డబ్బింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్)

జీ5

ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ రొమాంటిక్ సిరీస్)

మమ్మటియాన్ స్టార్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్)

ముతస్సీ (మలయాళ ఫోక్ హారర్, సూపర్‌నాచురల్ మిస్టరీ సిరీస్)

జియో హాట్‌స్టార్

లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)

లైఫ్, ల్యారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపీనెస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ స్కెచ్ కామెడీ వెబ్ సిరీస్)

ది బేర్ సీజన్ 5 (ఇంగ్లీష్ వర్క్‌ప్లేస్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)

లయన్స్‌గేట్ ప్లే

ది యెతి (తెలుగు డబ్బింగ్ మాన్‌స్టర్ హారర్ థ్రిల్లర్)

దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)

బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ బ్లాక్ కామెడీ డ్రామా)

సన్ నెక్ట్స్

మూండ్రమ్ కన్ (తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్)

రివాల్వర్ రింకో (మలయాళ అడ్వెంచర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా)

అమెజాన్ ప్రైమ్ వీడియో

అలియన్స్ (హిందీ సోషల్ స్ట్రాటజీ రియాలిటీ షో)

సోనీ లివ్

పర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ ఫ్యామిలీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్) 

సైనా ప్లే

కుండ్డాల పురాణం (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా) –

ఈటీవీ విన్ ఓటీటీ

కొత్త కొత్తగా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 25

డియర్ కేరళ కుట్టి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 25