జ్యోతిష్యం: శక్తివంతమైన పౌర్ణమి..తిరోగమనంలో బుధుడు.. ధనస్సు రాశిలోకి చంద్రుడు.. 4 రాశుల వారు పట్టింది బంగారం.. ముట్టింది ముత్యం

జ్యోతిష్యం: శక్తివంతమైన పౌర్ణమి..తిరోగమనంలో బుధుడు.. ధనస్సు రాశిలోకి  చంద్రుడు.. 4 రాశుల వారు పట్టింది బంగారం.. ముట్టింది ముత్యం

జ్యోతిష్యశాస్త్రంలో పౌర్ణమి, అమావాస్యలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది (2026)  జూన్​ 29 శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి..  ఈ పౌర్ణమి నాలుగు రాశుల వారికి అదృష్టం తీసుకరానున్నదంట. జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం రాబోతుంది. ఆ రోజు గ్రహాల కలయిక వలన  అనేక శుభ యోగాలు  ఏర్పడుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారం.. ముట్టింది ముత్యమే అవుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

జూన్​ 29 గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే.. బుధుడు తిరోగమనాన్ని ప్రారంభిస్తాడు.  ఆ రోజుకు శని మరియు శుక్రుడు గ్రహాల మధ్య నవమపంచమయోగం కొనసాగుతుంది.  చంద్రుడు..  ధనుస్సు రాశిలో సంచారం.. గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి : ఈ రాశి వారికి ఇది చాలా మంచి సమయయని పండితులు చెబుతున్నారు.  పౌర్ణమి ( జూన్​ 29)  తర్వాత వీరికి కలిసి వస్తుంది.అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది.  వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు.  కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనుకూల సమయం.  విదేశీ వ్యాపారాలు కలసి వస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో  మీరే చక్రం తిప్పే అవకాశం ఉంది.  ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి.  కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారికి బంధువర్గంలోని వారితో కుదిరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

మకర రాశి : జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుంచి ఈరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. వేతనాల్లో పెంపు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.  జీవితభాగస్వామి సలహాలతో కొత్త ప్రాజెక్ట్​లు చేపడతారు.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. పెళ్లి సంబంధం గురించి ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం దొరుకుతుంది.చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ఈ సమయం ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మీన రాశి : ఈ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేర్చుకుంటారు. ఆదాయం డబుల్ అవుతుంది.అనుకున్న పనులు అన్నీ సవ్యంగా జరుగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి.  గ్రహాల సంచారంలో మార్పు వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు లక్కు తీసుకొస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు అవార్డులు అందుకుంటారు.  వృత్తి పరంగా సొంత ఆలోచనలు అమలు చేయడంతో సక్సెస్​ సాధిస్తారు.  వ్యాపారస్తులు పొందే లాభాలు ఊహించి ఉండరు.  కొత్త బ్రాంచ్​లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ  రాశి వారికి పౌర్ణమి తర్వాత అదృష్టం  కలిసి వస్తుంది.  ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కెరీర్​ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. రాజయోగం ప్రభావంతో వీరికి స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోంది.  విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారికి విశేషమైన గుర్తింపు లభించబోతోంది. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.