చౌదరి మెస్ ఉండొచ్చు.. రెడ్డి హాస్టల్ ఉండొచ్చు.. నాయుడిగారి బిర్యానీ.. బ్రాహ్మణ భోజనం.. బిస్మిల్లా బిర్యానీ.. మెహఫిల్, షాగోస్ ఇలా ముస్లిం పేర్లతో బిర్యానీ హోటల్స్ ఉన్నాయి.. ఇలా చాలా సామాజిక వర్గాల పేర్లతో హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కామన్.. రొటీన్.. కొన్ని దశాబ్దాలుగా కులం పేరును వ్యాపారాలకు పెట్టడం మన తెలుగు రాష్ట్రాల్లో సర్వ సాధారణమైన విషయం అయిపోయింది.
కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ ఇలా హోటళ్లు బోలెడు కనిపిస్తాయి రోడ్డుపై వెళుతుంటే.. ఆయా వ్యాపారాలు, హోటళ్లలో పని చేసే వాళ్లు అందరూ ఆయా కులపోళ్లే ఉంటారా అంటే.. కచ్చితంగా ఉండరు. ఆ కులాలకు సంబంధించిన వాళ్లే వెళ్లి తింటారా అంటే.. కానే కాదు.. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎందుకీ టాపిక్.. ఇప్పుడు ఎందుకీ చర్చ అంటారా.. అక్కడికే వస్తున్నాం..
సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతుంది. అదే మాదిగ బిర్యానీ హౌస్.. అవును మీరు చదువుతున్న.. పైన ఫొటోలో చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. మాదిగ బిర్యానీ హౌస్. ఈ మాదిగ బిర్యానీ హౌస్ ఎక్కడుంది.. ఎక్కడ పెట్టారు.. ఎప్పుడు పెట్టారు అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. గూగుల్ అంతా వెతికినా ఈ మాదిగ బిర్యానీ హౌస్ అడ్రస్ లేదు.. ఎందుకంటే ఇది AI ఫొటో అంటున్నారు. సో.. మాదిగ బిర్యానీ హౌస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIతో క్రియేట్ చేసింది అనేది ఇప్పటికి క్లారిటీ వచ్చేసింది.
Madiga Biryani House 👏🏼
— VoiceOfMadiga-ಮಾದಿಗ ಧ್ವನಿ® (@JaiBhimMadiga) June 25, 2026
Good step indeed.
Interesting part will be how many go and have Biryani there? pic.twitter.com/nyMpKG9ptl
ఇక్కడే సోషల్ మీడియాలో నెటిజన్లు డిఫరెంట్గా స్పందిస్తున్నారు. అన్ని కులాల వాళ్లు.. అన్ని మతాల వాళ్లు వాళ్ల వాళ్ల కులం పేర్లతో హోటల్స్ పెట్టుకోవచ్చు.. మాదిగి బిర్యానీ హౌస్ అని ఎందుకు పెట్టుకోకూడదు.. ఇందులో తప్పేముందీ అనే ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు నెటిజన్లు. మాదిగ బిర్యానీ హౌస్ అని పేరు పెట్టటం అంటే గట్స్ ఉండాలని.. అలాంటి గట్స్తో వ్యాపారం మొదలుపెట్టటం అంటే మాటలు కాదని.. సమాజంలో మార్పునకు.. సమానత్వానికి ఇది నిదర్శనం అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు అయితే.. ఇది AI ఫొటో అని క్లారిటీ ఇస్తూనే.. మాదిగ బిర్యానీ హౌస్ అని పెట్టారు.. అగ్రవర్ణాలు ఎవరైనా ఇక్కడ బిర్యానీ కొనే దమ్ముందా.. అగ్రకులాలు ఇక్కడికి వస్తారా.. అగ్రవర్ణాలు దీన్ని సహిస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఏఐ క్రియేషనే అయినప్పటికీ ఈ మాదిగ బిర్యానీ హౌస్ నిజం కావాలని మాదిగ సంఘాలు కోరుకుంటున్నాయి. బ్రాహ్మణ భోజనం, రెడ్డి గారి హోటల్, చౌదరి మెస్, నాయుడు గారి బిర్యానీ.. అని పేర్లు పెట్టుకుని ఫుడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు.. ఎగబడి తింటున్నప్పుడు లేని అభ్యంతరం మాదిగ బిర్యానీ హౌస్ అని పెట్టుకుంటే మాత్రం ఎందుకని మాదిగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తాము మాత్రమే ఎదగాలని భావించే అగ్ర కులాల ఆలోచనా తీరుకు, ఇతర కులాలపై అణచివేత థోరణికి ఈ మాదిగ బిర్యానీ హౌస్పై వస్తున్న అభ్యంతరాలు, వెటకారాలే నిదర్శనం అని మాదిగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్క AI ఫొటో సమాజంలో కులాల విషయంలో ఇప్పటికీ ప్రజల ఆలోచనా థోరణికి అద్దం పట్టింది.
