హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌పై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణను పోలీసులు మూసివేయడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త బి.రాంప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ఇటీవల విచారణ చేపట్టగా, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి ఫిర్యాదును మూసివేశారని చెప్పారు. ఇది ఎస్సీ, ఎస్టీ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. దీనిపై కింది కోర్టును వెళ్లకుండా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
