శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం ( జూన్ 27 ) ఉదయం ఎయిర్ పోర్ట్ లోని చిన్మయి స్కూల్ సమీపంలో చిరుత కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను పరిశీలించారు.
చిరుత ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు అటవీశాఖ సిబ్బంది. చిరుత కనిపించిందనే వార్తతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్కూల్ సమీపంలో చిరుత సంచరించడంతో భయబ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు స్థానికులు.
ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత కనిపిస్తే వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు అధికారులు.
