గూగుల్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రాబోతున్న కొత్త సిరీస్ !

గూగుల్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రాబోతున్న కొత్త సిరీస్ !

గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో సరికొత్త ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్నెట్‌లో చాలా లీకులు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా గూగుల్ తెస్తున్న కొత్త ఫోల్డబుల్  ఫోన్ 'గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్' పై భారీ అంచనాలు ఉన్నాయి.

గూగుల్  కొత్త పిక్సెల్ 11 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లను తీసుకురానుందని తెలుస్తోంది. అవి పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL,  పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్. కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు చెప్పకపోయిన.. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్లలో అదిరిపోయే డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉండబోతున్నాయి.

 డిస్‌ప్లే & హార్డ్‌వేర్ ఫీచర్లు 
 ఈ ఫోన్ లోపల 8 అంగుళాల పెద్ద స్క్రీన్, అలాగే  6.4 అంగుళాల కవర్ స్క్రీన్ ఉంటాయి. ఈ రెండు స్క్రీన్స్ కూడా 120Hz లేదా 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా పనిచేస్తాయి. దీని స్క్రీన్ బ్రైట్‌నెస్ చాలా ఎక్కువగా (3,000 నుండి 3,600 నిట్స్ వరకు) ఉంటుంది. అంటే ఎండలో చూసినా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

గూగుల్ సొంతంగా తయారు చేసిన పవర్‌ఫుల్ టెన్సర్ G6 (Tensor G6) ప్రాసెసర్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనికి 16GB RAM ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 256GB నుండి 1TB వరకు ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 5,050mAh  బ్యాటరీ ఉండబోతోంది.

 కెమెరా సిస్టమ్
ఫోటోగ్రఫీకి గూగుల్ ఫోన్లు చాలా ఫేమస్. ఈ ఫోల్డబుల్ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా (5X ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో), 10.5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మూడు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

 లాంచ్ ఎప్పుడు? ఇండియాలో ధర ఎంఎంతంటే 
 గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లన్నీ 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇండియాలో ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 1,59,999 నుండి రూ. 1,81,999 మధ్యలో ఉండవచ్చని మార్కెట్ వర్గాల టాక్. అయితే గూగుల్ సంస్థ ఈ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ లీకైన ఫీచర్లను బట్టి చూస్తే, 2026లో రాబోయే అత్యంత పవర్‌ఫుల్ ఫోల్డబుల్ ఫోన్లలో ఇదొక్కటిగా నిలవడం ఖాయం.