Cabo Verde: ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక అద్భుతమైన హిస్టరీ నమోదు అయింది. నిన్న (జూన్ 26న) జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లతో టోర్నీ డెబ్యూ టీమ్ కేప్ వర్దే (Cabo Verde) అధికారికంగా నాకౌట్ (Round of 32) కి క్వాలిఫై అయి ఫుట్‌బాల్ చరిత్రలోనే సరికొత్త రికార్డును లిఖించింది. శుక్రవారం రాత్రి హ్యూస్టన్ స్టేడియంలో సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌ను 0–0తో డ్రా చేసుకోవడం ద్వారా.. వరల్డ్ కప్ హిస్టరీలోనే నాకౌట్ స్టేజ్‌కు చేరిన అత్యంత చిన్న దేశంగా కేప్ వర్దే నిలిచింది.
మూడు డ్రాలతో ముంచేశారు:
కేవలం 5 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న ద్వీప దేశం (Blue Sharks).. దాదాపు అసాధ్యమనుకున్న గ్రూప్-H నుంచి నాకౌట్ కి దూసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌లను కూడా ప్లానింగ్‌తో డ్రా చేసుకుని, మొత్తం 3 పాయింట్లతో గ్రూప్‌లో స్పెయిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ ప్రాసెస్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాలు అయిన ఉరుగ్వే, సౌదీ అరేబియా వంటి పవర్ ఫుల్ జట్లను వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ చేసింది.
కేప్ వర్దే తన గ్రూప్ స్టేజ్ ప్రయాణం:
* మొదటి మ్యాచ్: స్పెయిన్‌తో 0–0తో డ్రా..
* రెండో మ్యాచ్: ఉరుగ్వేతో 2–2 తేడాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ డ్రా..
* మూడో మ్యాచ్: సౌదీ అరేబియాతో 0–0తో చారిత్రాత్మక డ్రా.. దీంతో 1998లో చిలీ టీమ్ తర్వాత.. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లను డ్రా చేసుకుని నాకౌట్‌కు చేరిన మొదటి జట్టుగా కోచ్ బుబిస్టా (Bubista) సేన రికార్డు సృష్టించింది.
గ్రౌండ్ లోనే ఏడ్చేసిన ప్లేయర్లు:
నాకౌట్‌కు చేరాలంటే ఒక్క పాయింట్ అవసరమైన టైమ్‌లో.. కేప్ వర్దే డిఫెన్స్ చాలా పట్టుదలతో ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు 40 ఏళ్ల ఐకానిక్ గోల్‌కీపర్ వోజిన్హా (Vozinha) మైదానంలో ప్రాణం పెట్టి ఆడాడు. ఫస్ట్ హాఫ్ ఇజ్యూరీ టైమ్‌లో సౌదీ ప్లేయర్ మొహమ్మద్ కన్నో హెడర్‌ను గోల్ లైన్ వద్ద ఆపేసిన వోజిన్హా.. ఆ తర్వాత 66, 92వ నిమిషాల్లో రెండు వరల్డ్ క్లాస్ రిఫ్లెక్స్ సేవ్స్‌తో క్లీన్ షీట్‌ను కాపాడాడు. మిడ్‌ఫీల్డర్ డెరాయ్ డువార్టే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఫైనల్ విజిల్ పడగానే హ్యూస్టన్ స్టేడియం అంతా ఎమోషన్స్‌తో నిండిపోయింది. దేశ జెండాలు కప్పుకొని ప్లేయర్లు మైదానంలోనే ఏడ్చేశారు.
నెక్స్ట్ మ్యాచ్ మెస్సీ జట్టుతోనే:
అయితే ఈ పసికూన దేశం సృష్టించిన ఫెయిరీ టేల్‌కు ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్-H లో రెండో స్థానంలో నిలిచిన కేప్ వర్దే.. రౌండ్ ఆఫ్ 32 లో డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్ అయిన లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా టీమ్‌తో తలపడనుంది.
CABO VERDE IS OFFICIALLY THE SMALLEST COUNTRY TO EVER ADVANCE TO THE WORLD CUP KNOCKOUT STAGE 🇨🇻🇨🇻 pic.twitter.com/45l3aC0E9j
— Nico (@elitetakes_) June 27, 2026
Así se enteraban los jugadores de Cabo Verde que habían clasificado a los 16vos. Qué hermoso es el mundial. https://t.co/APx4K0XIVm pic.twitter.com/71zefXjQQ9
— Fabipa (@fabipa90) June 27, 2026
May God crown Vozinha and Cape Verde efforts with success tonight.
— Zadok Yohanna fan🇳🇬 (@Zadok_yoha) June 26, 2026
I wish cabo Verde victory over Saudi Arabia tonight. ❤️👤🙏🙏⚽ pic.twitter.com/NgGQKe03XT
