IPL 2027 ట్రేడింగ్ రచ్చ.. వేలానికి ముందే జట్లు మారుతున్న స్టార్ ప్లేయర్లు వీళ్లే!

IPL 2027 ట్రేడింగ్ రచ్చ.. వేలానికి ముందే జట్లు మారుతున్న స్టార్ ప్లేయర్లు వీళ్లే!

IPL Player Trades: ఐపీఎల్ 2027 మెగా వేలానికి (Mini Auction) ముందే ఐపీఎల్ ట్రేడింగ్ (IPL Trading) విండోలో ద్వారా అసలు సిసలైన డ్రామా స్టార్ట్ అయింది. ఆల్రెడీ రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లు ట్రేడింగ్ ద్వారా జట్లు మారగా.. ఇప్పుడు మరి కొంత మంది స్టార్ ప్లేయర్ల ఫ్యూచర్ గురించి క్రీడా వర్గాల్లో గట్టి చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఏ ప్లేయర్ ఏ ఫ్రాంచైజీకి వెళ్లే ఛాన్స్ ఉందో ఆ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు V6 వెలుగు స్పోర్ట్స్ లో చూద్దాం.. 

 

ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా: 

హార్దిక్ పాండ్యా ఔట్: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా దూరమవుతున్నాడని టాక్ జోరుగా నడుస్తోంది. అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గట్టిగా ట్రై చేస్తుంది. ఒకవేళ హార్దిక్ కేకేఆర్‌కు వస్తే.. అతనికి బదులుగా కామెరూన్ గ్రీన్‌ను ముంబైకి ట్రేడ్ చేసేకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సూర్య కోసం గట్టి పోటీ: ముంబై ఇండియన్స్ జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను పట్టుకోవాలని అటు కోల్‌కతా, ఇటు రాజస్థాన్ రాయల్స్ తెగ పోటీ పడుతున్నాయి. రెండు జట్లకూ సీనియర్ కెప్టెన్ అవసరం ఉంది.. కేకేఆర్ అయితే అజింక్య రహానేకు థాంక్యూ చెప్పేసి ఆ ప్లేస్‌లో సూర్యను తేవాలని చూస్తోంది. ఒకవేళ సూర్య రాజస్థాన్‌కు వెళ్తే.. అతనికి బదులుగా యశస్వి జైస్వాల్‌ను ముంబైకి ట్రేడ్ చేయాలనుకుంటున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లాన్స్: 

ఖలీల్ అహ్మద్, రుతురాజ్: ఖలీల్ అహ్మద్‌ను వదులుకోవడానికి చెన్నై రెడీ అవుతుండగా.. అతని కోసం ముంబై ఇండియన్స్ జట్టు ట్రై చేస్తోంది. ఇంకోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విషయంలో చెన్నై మేనేజ్‌మెంట్ అంత హ్యాపీగా లేదు, ఈ ట్రేడ్‌లో అతను కూడా మారే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. 

ఫినిషర్ అశుతోష్ శర్మ: ఫినిషర్ అశుతోష్ శర్మను చెన్నైకి ట్రేడ్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం చూస్తోంది. దీనికి బదులుగా ఒక స్పిన్నర్‌తో పాటు గుర్జాప్‌నీత్ సింగ్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. 

ఢిల్లీకి కొత్త కెప్టెన్: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్ రావడం పక్కా. కొత్తగా వచ్చిన పంత్ కానీ, కేఎల్ రాహుల్ కానీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అక్షర్ పటేల్ లక్నో లేదా చెన్నై టీమ్‌కు వెళ్లే అవకాశం కానొస్తుంది. 

►ALSO READ | ఈక్వడార్ చేతిలో ఓటమి.. జర్మనీ జట్టులో విభేదాలు

శివమ్ దూబేకు స్కెచ్: హార్థిక్ పాండ్యా స్థానంలో చాలా ఏళ్లుగా సీఎస్‌కేలో ఫినిషర్‌గా ఉన్న శివమ్ దూబెను ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ దక్కించుకోవాలని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ముంబై డిస్కషన్: 

ఇషాన్ కిషన్: రిటైన్ సమయంలో ఇషాన్ కిషన్‌ను వదులుకున్న ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అతన్ని ట్రేడ్ చేసుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌తో సంప్రదింపులు జరుపుతోందట.

ప్రశాంత్ వీర్: ప్రశాంత్ వీర్‌ను తీసుకొని సరిగ్గా అవకాశాలు ఇవ్వని చెన్నై సూపర్ కింగ్స్.. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్‌కు ట్రేడ్ చేయాలని చూస్తోందని టాక్.