Disagreements within the German football team: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో వరుసగా రెండు సార్లు గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటికి పోయిన జర్మనీ టీమ్.. ఈసారి ఎట్లనో అట్ల నాకౌట్ (Round of 32) కి అయితే చేరుకుంది. గ్రూప్-ఈలో టాప్ ప్లేస్ కొట్టినప్పటికీ జర్మనీ ప్రయాణం మాత్రం అంత సఫీగా సాగలేదు. ఐవరీ కోస్ట్‌పై కష్టపడి గెలిచిన జూలియన్ నాగెల్స్‌మన్ జట్టుకు.. గురువారం జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ల ఈక్వెడార్ 1–2తో గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఓటమి ఫోర్-టైమ్ ఛాంపియన్స్ అయిన జర్మనీ కళ్లు తెరిపించాల్సింది పోయి.. అసలు ఎందుకు ఓడిపోయామనే ముచ్చట మీద టీం లోపల గట్టి పంచాయితీని పెట్టింది.
కెప్టెన్ కిమ్మిచ్ హాట్ కామెంట్స్:
మ్యాచ్ స్టార్ట్ అయిన రెండో నిమిషంలోనే లెరాయ్ సనే గోల్ కొట్టి జర్మనీకి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చిండు. కానీ ఆ తర్వాత జర్మనీ ఆటతీరు అస్సలు బాలేదు. నాకౌట్ రేసులో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈక్వెడార్ టీమ్.. జర్మనీ కంటే ఎక్కువ స్పీడుతో ఆడింది. దీనిపై జర్మనీ కెప్టెన్ కిమ్మిచ్ మాట్లాడుతూ.. మాకంటే వాళ్లకే గెలవాలనే అక్కసు ఎక్కువగా ఉందనిపించింది. ఈక్వెడార్ ప్లేయర్లు మస్తు అగ్రెసివ్‌గా ఆడారు.. ప్రతి బాల్ కోసం వాళ్లు 100 శాతం ఎఫర్ట్ పెట్టారు. మనం కూడా గ్రౌండ్ లో సర్వస్వం పెట్టాలనే ముచ్చట ఈ మ్యాచ్ తోనైనా నేర్చుకోవాలె అని గరం అయ్యాడు.
ఆ తిక్క ముచ్చట్లు ఆపండి.. అది టాక్టికల్ సూసైడ్: కోచ్
అయితే కెప్టెన్, స్ట్రైకర్ చెప్పిన రీజన్స్‌ను జర్మనీ మేనేజర్ (కోచ్) జూలియన్ నాగెల్స్‌మన్ అస్సలు ఒప్పుకుంటలేడు.. ప్లేయర్లలో కసి లేదనే ముచ్చటను ఆయన కొట్టిపారేసిండు. దయచేసి ఆ తిక్క ముచ్చట్లను ఇక్కడితో ఆపేయండి.. మనం మ్యాచ్‌ను చాలా మంచిగానే స్టార్ట్ చేసినం.. కానీ దురదృష్టవశాత్తూ, గోల్ కొట్టిన వెంటనే మన పొజిషనింగ్‌తో మనమే టాక్టికల్ సూసైడ్ (వ్యూహాత్మక ఆత్మహత్య) చేసుకున్నాం.. ఈక్వెడార్‌కు ఇది ప్రాణసంకటమైన మ్యాచ్, అందుకే వాళ్లు స్పీడ్ పెంచారు.. అంతమాత్రాన జర్మనీ ప్లేయర్లు గ్రౌండ్‌లో శ్రమించలేదని నేను అస్సలు అనను.. ఓటమికి అంత సింపుల్ రీజన్ చెప్పడం కరెక్ట్ కాదని కోచ్ వెల్లడించారు.
