హైదరాబాద్, వెలుగు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అనురాగ్ నల్గొండ నైట్స్.. టీజీ 20 లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. నితీశ్ రెడ్డి (81), గౌరవ్ రెడ్డి (80) రాణించడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నల్గొండ 91 రన్స్ తేడాతో వరంగల్ వారియర్స్‌పై గెలిచింది.
టాస్ ఓడిన నల్గొండ 20 ఓవర్లలో 259/5 స్కోరు చేసింది. అర్ఫాజ్ అహ్మద్ (33), రోహిత్ రాయుడు (31) ఫర్వాలేదనిపించారు. తర్వాత వరంగల్ 14 ఓవర్లలో 168 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ అమన్ రావు (46), మురుగన్ అభిషేక్ (44), భవేష్ సేథ్ (22) మినహా మిగతా వారు నిరాశపర్చారు.
మరో మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ 8 రన్స్ తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై నెగ్గింది. ముందుగా ఖమ్మం 20 ఓవర్లలో 213/6 స్కోరు చేసింది. మికిల్ జైస్వాల్ (64 నాటౌట్), హిమతేజ (56), జీఎస్‌కే రెడ్డి (43) రాణించారు. తర్వాత కరీంనగర్ 20 ఓవర్లలో 206/9 స్కోరుకే పరిమితమైంది. సాత్విక్ రెడ్డి (63), శుభమ్ శర్మ (54 నాటౌట్), చందన్ సహనీ (38) రాణించినా ప్రయోజనం దక్కలేదు. చామ మిలింద్ 4 వికెట్లు తీశాడు.
