బీజేపీది ఫేక్ హిందుత్వం..వారంతా నకిలీ హిందువులు: స్వామి అవిముక్తేశ్వరానంద్

బీజేపీది ఫేక్ హిందుత్వం..వారంతా నకిలీ హిందువులు: స్వామి అవిముక్తేశ్వరానంద్

సంభల్:  బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వం కేవలం ఓ ముసుగు మాత్రమేనని, ఆ పార్టీలోని వారంతా నకిలీ హిందువులు అని జ్యోతిర్మఠానికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ధ్వజమెత్తారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో నమోదైన ఎఫ్‌‌ఐఆర్ తీరును తప్పుబడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు ఎఫ్‌‌ఐఆర్‌‌ను ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేవలం నోట్లు లెక్కించే కింది స్థాయి సిబ్బందిని మాత్రమే నిందితులుగా చేర్చి, భారీ అక్రమాలకు పాల్పడిన అసలు బాధ్యులను వదిలేశారని ఆరోపించారు.