సంపులో పడి చిన్నారి మృతి.. మహబూబ్ నగర్ రూరల్లో ఘటన

సంపులో పడి చిన్నారి మృతి.. మహబూబ్ నగర్ రూరల్లో ఘటన

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: నీటి సంపులో పడి  మూడేండ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ రూరల్ మండలం రామచంద్రపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రపురం గ్రామానికి చెందిన రాజు యాదవ్, లక్ష్మీ కుమారుడు మణికంఠ యాదవ్ (3) ఎల్ కేజీ చదువుతున్నాడు.

మొహర్రం సందర్భంగా శుక్రవారం స్కూల్ కు సెలవు కావడంతో ఉదయం ఇంటి ముందు ఆడుకుంటూ... ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెదికినా ఆచూకీ దొరకలేదు. సాయంత్రం ఇంటి ముందున్న సంపులో బాలుడిని గుర్తించి బయటకు తీయగా.. అప్పటికే చనిపోయి కనిపించాడు.