- ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
నాగర్‌కర్నూల్, వెలుగు: శ్రీశైలం ఎడమగట్టు భూగర్బ జల విద్యుత్ కేంద్రంలో పలుమార్లు పరిశీలించిన అనంతరం 4వ యూనిట్‌ను ప్రారంభించారు. జెన్కో ఉన్నతాధికారులు, ఇంజనీర్లు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు గ్రిడ్కు అనుసంధానం చేశారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌజ్లో 150 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ఆరు యూనిట్లకు గాను, ప్రస్తుతం ఐదు యూనిట్లను గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఆరవ యూనిట్ వ్రైబేషన్, ఫ్రీక్వెన్సీ టెస్టుల అనంతరం గ్రిడ్కు అనుసంధానం చేస్తామని ఎస్ఈ ఆదినారాయణ తెలిపారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కెపాసిటీ 900 మెగావాట్లుకాగా, ఆరేండ్ల పాటు ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల విద్యుత్ నుఉత్పత్తి చేశారు. 4వ యూనిట్ అందుబాటులోకి రావడంతో ప్లాంట్ పూర్తి కెపాసిటీ మేరకు 900 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. వారం రోజులుగా శ్రీశైలం పవర్ హౌజ్లో ఉండి పనులను పర్యవేక్షించిన జెన్కో డైరెక్టర్ బాలరాజు, ఎస్ఈ ఆదినారాయణతో పాటు వాయెట్ కంపెనీ ప్రతినిధులు సాంకేతిక సమస్యలను పరిష్కరించారు.
