అక్టోబర్ 31లోగా బకాయిలు చెల్లించాలి : ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ రామ్‌‌‌‌‌‌‌‌కుమార్

అక్టోబర్ 31లోగా బకాయిలు చెల్లించాలి : ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ రామ్‌‌‌‌‌‌‌‌కుమార్

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలోని డిఫాల్ట్ రైసు మిల్లర్లు తమ బకాయిలను అక్టోబర్ 31లోగా పూర్తిగా చెల్లించాలని ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ టాస్క్​ ఫోర్స్ ఎస్పీ రామ్‌‌‌‌‌‌‌‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌లో డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022–-23 రబీ సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి వేలం ద్వారా కేటాయించిన వరి తాలూకు రూ.474 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు కేవలం రూ.62.50 కోట్లు మాత్రమే చెల్లించారని, ఇంకా రూ.412 కోట్లు వసూలు చేయాల్సి ఉందని వెల్లడించారు. 

గడువులోగా బకాయిలు చెల్లించడంలో విఫలమైతే రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే డిఫాల్టర్ల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ బకాయిలను రికవరీ చేస్తామని చెప్పారు. బకాయిలను పూర్తిగా చెల్లించిన తర్వాతే మిల్లర్ల అభ్యర్థనలను సివిల్ సప్లైస్ కమిషనర్ పరిశీలిస్తారని పేర్కొంటూ, తదుపరి కఠిన చర్యలకు తావులేకుండా మిల్లర్లంతా నిర్దేశిత తేదీలోగా బకాయిలు చెల్లించాలని హెచ్చరించారు.  సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్, అడిషనల్​ కలెక్టర్  టి.వినోద్​, డీఎస్​ఓ, డీఎం,  సంబంధిత డిఫాల్ట్ రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.