ఎక్కువ షో చేయకు.. సక్కగా ఆట ఆడు: మ్యాచ్ మధ్యలో స్టీవ్ స్మిత్‎పై ఫ్యాన్ ఫైర్..!

ఎక్కువ షో చేయకు.. సక్కగా ఆట ఆడు: మ్యాచ్ మధ్యలో స్టీవ్ స్మిత్‎పై ఫ్యాన్ ఫైర్..!

డార్విన్‌లోని మార్రారా క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‏లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‎పై మ్యాచ్ మధ్యలో సొంత దేశ అభిమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కువ షో చేయకుండా.. సక్కగా ఆట ఆడు అంటూ గట్టిగా అరిచాడు. ఆస్ట్రేలియా ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‎సైట్ ఫాక్స్ క్రికెట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‎గా మారింది.

అసలేం జరిగిందంటే..?

డార్విన్‌లోని మార్రారా క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‏లో తలపడుతున్నాయి. గురువారం (ఆగస్ట్ 13) ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‎లో భాగంగా ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సైట్ స్క్రీన్ దగ్గర ఒక వ్యక్తి నడుస్తూ ఉండటాన్ని గమనించిన స్మిత్ బౌలర్ బాల్ వేయకుండా అడ్డుకున్నాడు. అంపైర్లకు సైతం ఆ వ్యక్తిని పక్కకు వెళ్లామని చెప్పండంటూ సైగ చేశాడు.

దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ ఆలస్యంపై స్టేడియంలోని గ్యాలరీలో కూర్చొన్న ఓ ఆస్ట్రేలియా అభిమాని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘బ్యాటింగ్ చేయి స్మిత్.. రాజకుమారుడిలా ప్రవర్తించకు. నువ్వు ఆట కంటే పెద్దోడివి ఏమీ కాదు.. కాస్త సర్దుకుపో’’ అని గట్టిగా అరిచాడు. ఈ వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‎గా మారింది.

అయితే, అభిమాని మాటలను పట్టించుకోని స్మిత్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి ఆసీస్‎ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‏లో బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమూద్ (6/55) ధాటికి ఆస్ట్రేలియా కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ (71) హాఫ్ సెంచరీతో  ఒంటరి పోరాటం చేశాడు.