రేపటి (జూన్ 28) నుంచే పల్స్ పోలియో..రాష్ట్రంలో 41 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడమే టార్గెట్

రేపటి (జూన్ 28) నుంచే పల్స్ పోలియో..రాష్ట్రంలో 41 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడమే టార్గెట్
  • ఆదివారం బూత్ డే.. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ డ్రైవ్
  • జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ సహా 4 జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రేపు పోలియో బూత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దేశించిన సెంటర్లలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ రెండు చుక్కల పోలియో మందు వేస్తారు. బూత్ రోజున టీకా వేయించుకోలేకపోయిన పిల్లల కోసం జూన్ 29, 30 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు నేరుగా ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారు. జనాభా రద్దీ ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో అదనంగా జులై 1వ తేదీన డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగనుంది.

903 మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,97,749 మంది చిన్నారులకు టీకా వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 22,979 పోలియో బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల 903 ట్రాన్సిట్ పాయింట్లను, మారుమూల ప్రాంతాల కోసం 903 మొబైల్ టీంలను సిద్ధం చేశారు. 8,754 మంది ఏఎన్ఎంలు, 28,160 మంది ఆశా కార్యకర్తలు, 35,700 మంది అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో సేవలందించనున్నారు.

వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 2,298 మంది రూట్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లను ప్రభుత్వం నియమించింది. వ్యాక్సిన్ సప్లైలో ఇబ్బందులు కలగకుండా 52,04,140 బీఓపీవీ డోసులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పురపాలక శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, పోలీసు, రక్షణ శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.