చాలా సంవత్సరాలుగా మగవారు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి మరియు ఆడవారు ఇంటికే పరిమితమై ఇంటి పనులు మాత్రమే చేసుకోవాలి అని పరిగణించడం జరిగింది. అలాగే మహిళలు కూడా కొన్నింటిని పాటించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .
ఇంటి పని.. వంటపని ఇల్లాలే చేస్తుంది. వర్కిగ్ ఉమెన్ అయినా.. హౌస్ వైఫ్ అయినా సరే.. ఆడవారికి మాత్రం కొన్ని బాధ్యతలు తప్పవు. పిల్లల స్నానాల దగ్గరి నుంచి బడికి బ్యాగ్ సర్దే వరకు ఇల్లాలే చేస్తుంది. ఒకవేళ మగవాడు చేస్తే ఏదో ఒక లోపం తలెత్తుతుంది.. అప్పుడు మమ్మీ.. రోజూ నీవే రడీ చేయి.. డాడీ వద్దు అని పిల్లలు మారాం చేస్తుంటారు. ఇక ఈ బాధ్యతలతో ఆధ్యాత్మిక పరంగా కొన్నింటిని కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
- 1. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.
- 2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..
- 3. అరికాలు లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు.
- 4. తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది..
- 5. ఆదివారం అష్టమి,ఆదివారం అమావాస్య, ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం , బైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..
- 6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా చదివినా.. విన్న.. లేదా ఓంనమ:శివాయ అని 11 సార్లు తలచుకొన్న తరువాత నిద్రపోతే మంచిది.
- 7. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి. ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.
- 8. తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తల లో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి.
- 9. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు.
- 10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..
- 11. కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు.
- 12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే.. మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్దతులు.
- 13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి , అమంగళం పలక కూడదు..పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచ కూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది..
- 14. కొన్ని వస్తువులను మంత్రించి వశీకరణకు వాడుతారు. మీకు తెలియని కొత్త వారి చేతి నుంచి ఏ వస్తువు నేరుగా తీసుకోకూడదు.
- 15. చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ల కూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు...
- 16. ఓం దుం దుర్గాయే నమః అని నిరంతరం జపించు కుంటూ ఉండండి. మనసులో.. నిరంతర రామ నామ జపం క్రిష్ణ మంత్రం మీ ఇలవెలుపు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన మీకు రక్షణ కలుగుతుంది..
- 17. స్త్రీలు మట్టి గాజులు ధరించడం చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని వృద్ది చేస్తాయి. వీటి శబ్దము శుభాలను .. అనురాగాలను పెంచుతుంది. ఒక్కో చేతికి కనీసం మూడు గాజులు ధరించాలి.
- 18. వంట చేసేటప్పుడు ముందుగా రెండు బియ్యం గింజలను అగ్నిదేవునికి సమర్పించండి. వండిన పదార్దాలు.. ఎంతో రుచికరంగాను.. ఆరోగ్యకరంగాను ఉంటాయి.
- 19. సంపదలను ఎక్కువుగా ప్రదర్శించడం వలన నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరిగే అవకాశం ఉంది. ఇలా జరుగకుండా ఉండేందుకు సాధారణ జీవిత విధానాన్ని పాటించడం వలన నరదృష్టి నుంచి తప్పించుకొనే అవకాశాలున్నాయి.
- 20. సుఖసంతోషాలు కరువైన వారు పసుపురంగు పూలను తలలో పెట్టుకోండి.. క్రమేణ ఇబ్బందులు తొలగుతాయి.
- 21. అప్పుల బాధలు ఎక్కువైన వారు తెల్లని పూలను తలలో పెట్టుకోండి.. ఇల చేయడం వలన రుణ బాధలు తగ్గుతాయి.
- 22. ఆరోగ్య ఇబ్బందులున్నవారు.. శరీరం నొప్పులున్నవారు మరువం.. మందార పూలు కలిపి ధరించండి.. 20 రోజులలో ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
- 23. పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు.. పసుపు పూలు మాల కట్టి ధరించాలి. ఇలా చేమడం వలన కన్యలకు ఎంతో శుభమైన ఫలితాలు కలుగుతాయి.
- 24. భర్త బయటకు వెళ్లేటప్పుడు.. షర్టుకు మీరు బటన్స్ ( గుండీలు) పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి.. భర్త వెళ్లిన పనిలో తప్పక విజయం సాధించి.. సంతోషంతో తిరిగి వస్తారు.
పరిస్థితులు మారాయి.. జీవన పద్దతులు ఛేంజ్ అయ్యాయి.. ఖర్చులు పెరిగాయి.. ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే జీనవం కొనసాగడం కష్టం.. చాలామంది ఆడవాళ్ల ఉదయం లేచిన తర్వాత నుంచి రాత్రి నిద్రపోయే వరకు... నిమిషం కూడా ఖాళీ లేకుండా గడియారంలో ముళ్లులా పనిచేస్తూనే ఉంటారు. పిల్లల్లకు టిఫిన్ , మధ్యాహ్నం భోజనం, ఇళ్లు క్లీనింగ్, ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి ఆలనాపాలనా, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం.. ఈ పని భారం అంతా ఆడవాళ్ల మీదే ఉంటుంది. ఇక, వర్కింగ్ ఉమెన్ అయితే.. హడావిడిగా ఆఫీస్‌కు వెళ్లి అక్కడా గడియారంలా పనిచేస్తూనే ఉంటారు. ఎంత హడావిడి ఉన్నా కచ్చితంగా ఆడవారు కొన్ని కచ్చితంగా ఈ పద్దతులు పాటించాలని పురాణాలు చెబుతున్నాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
