జ్యోతిష్యం ప్రకారం... జ్యేష్ఠ పూర్ణిమ రోజు ( 2026జూన్ 29) కుబేరుడు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. వీరి అనుగ్రహం లేకపోతే ఎంత సంపాదించినా ఉండదు. అయితే జ్యేష్ఠ పూర్ణిమ ఘడియల్లో మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే, లక్ష్మీదేవి, కుబేర స్వామి ఆశీస్సులు పొందొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ వేళ ఏ రాశి వారు ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
హిందూ మత విశ్వాసాల ప్రకారం, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున చంద్రుడు తన 16 కళలతో నిండుగా ఉంటాడు. ఈ పర్వదినాన శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది.
- జ్యేష్ఠ పూర్ణిమ తిథి ప్రారంభం : 2026 జూన్ 29 సోమవారం తెల్లవారుజామున 3.06 గంటలకు
- జ్యేష్ఠ పూర్ణిమ తిథి ముగింపు : 2026 జూన్ 30 ఆది వారం తెల్లవారుజామున 5.26 గంటలకు
- పండితులు తెలిపిన వివరాల ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ పూజలు తేది : 2026 జూన్ 29 సోమవారం
- పవిత్ర స్నానాలకు అనుకూలమైన బ్రహ్మ ముహూర్తం: 2026 జూన్ 29 సోమవారంఉదయం 4:06 గంటల నుంచి 4:46 గంటల వరకు
- అభిజిత్ ముహూర్తం : 2026 జూన్ 29 సోమవారం ఉదయం 11:57 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు
- పూజలు చేయుటకు అమృత ఘడియలు: ఉదయం 5:26 గంటల నుంచి 7:11 గంటల వరకు మరియు ఉదయం 8:55 గంటల నుంచి 10:40 గంటల వరకు
- పూర్ణిమ రాత్రి వేళ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించే సమయం: 7.06 గంటలకు
- ప్రదోషకాలంలో లక్ష్మీదేవి పూజ సమయం : జూన్ 29 రాత్రి 7:23 గంటల నుంచి 8:38 గంటల వరకు
జ్యేష్ఠ పూర్ణిమ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, కుబేర స్వామికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం, జ్యేష్ఠ పూర్ణిమ రోజున పూజ అనంతరం మీ రాశిని బట్టి కొన్ని వస్తువులను తప్పనిసరిగా దానం చేయడం వల్ల డబ్బుకు లోటనేదే ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . ...
మేష రాశి: ఈ రాశి వారికి కుజుడు అధిపతి... జ్యేష్ఠ పూర్ణమి వేళ ఎరుపు రంగు దుస్తులు, పప్పు ధాన్యాలు , బియ్యం, పాయసం, శనగలు తదితర వాటిని దానం చేయాలి.ఇలా చేయడం వలన ఏడాదంతా లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పంచదార, వెన్న దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మిధున రాశి: ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున గోమాతకు పచ్చి గడ్డి దానం చేయాలి. గోశాలకు మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వాలి. బియ్యం దేవాలయంలో బ్రాహ్మణులకు కాని.. పేదవారికి కాని దానం చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ది చెందుతుంది. ఉద్యోగస్తులకు సమస్యలు పరిష్కారమవుతాయి.
కర్కాటక రాశి:ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ నాడు పాలు, పెరుగు, అన్నం, పంచదార తదితర వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వలన కుబేరునితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి.
సింహ రాశి:ఈ రాశి వారు గోధుమలు, బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వలన మహావిష్ణువు అనుగ్రహం కలగడంతో పాటు జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోతాయి.
కన్య రాశి:జ్యేష్ఠ పూర్ణిమ వేళ ఈ రాశి వారు సీజనల్ పండ్లు, కూరగాయలు దానం చేయాలి. అలాగే బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీలక్ష్మీనారాయణుల ఆశీస్సులు కలుగుతాయి.
తులా రాశి:ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. వీటితో పాటు పాలు, బియ్యం, నెయ్యి దానం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందొచ్చు.
వృశ్చిక రాశి: ఈ పాదచారులకు ఏదైనా పండ్ల రసాన్ని ఇవ్వాలి. పేద వారికి ఎరుపు రంగు దుస్తులు కూడా ఇవ్వాలి. ఇలా చేయడం వలన గ్రహదోషాల నుంచి విముక్తి కలుగుతుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున పేదలకు కుంకుమ కలిపిన పాలను పంచాలి. గోమాతకు తోటకూరను ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన సకల దేవతల ఆశీస్సులు కలుగుతాయి.
మకర రాశి:ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ గొడుగు, తోలు చెప్పులు, పాదరక్షలు దానం చేయాలి.ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కుంభ రాశి:ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ నల్ల నువ్వులు, నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
మీన రాశి:ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పసుపు వస్తువులు, పుస్తకాలు, తేనే తదితర వాటిని దానం చేయాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వాలి. దీని వల్ల మీ జీవితంలో మంచి ప్రయోజనాలు చేకూరతాయి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
