CJP సమావేశానికి హాల్ ఇవ్వొద్దంటూ బెదిరింపులు.. చిన్న చిన్న చర్యలతో మమ్మల్ని అడ్డుకోలేరు: అభిజీత్ దీప్కే

CJP సమావేశానికి హాల్ ఇవ్వొద్దంటూ బెదిరింపులు.. చిన్న చిన్న చర్యలతో మమ్మల్ని అడ్డుకోలేరు: అభిజీత్ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో  CJP సమావేశానికి  హాల్ ఇవ్వొద్దంటూ ఓనర్లను బెదిరిస్తున్నారని అన్నారు. ఢిల్లీ మొత్తం తిరిగాం.. ఎవ్వరూ హాల్ రెంట్ కు ఇచ్చేందుకు ముందుకురాలేదు.. కారణం అడిగితే సీజేపీ  ప్రతినిధులకు అద్దెకు ఇచ్చే తీవ్ర పరిణామాలుంటాయని ఓనర్లకు కొందరు వ్యక్తులు వార్నింగ్ ఇస్తున్నారని అభిజిత్ దీప్కే చెప్పారు. ఒకరు హాల్ రెంట్ కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.  అద్దె తీసుకున్నట్లు  రషీదు కూడా ఇచ్చారు.అయితే వారికి కూడా బెదిరింపులు వచ్చాయి. తలకిందులుగా చేసి కొడతామని వార్నింగ్ ఇచ్చారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. 

ఇదంతా బీజేపీ పనే అని అన్నారు. వారి మాటలు, చర్యలు చూస్తుంటే దేశ యువత అంటే వారికి భయం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.. ఇలాంటి చిన్న చర్యలతో మమ్మల్ని భయపెట్టగలమని బీజేపీ అనుకుంటేఅది వారి పొరపాటే అని అభిజిత్ దీప్కే అన్నారు.