Paathirathri OTT: అర్థరాత్రి ట్విస్టులతో ఉత్కంఠ రేపే కాప్ థ్రిల్లర్.. సౌబిన్ ‘పాతిరాత్రి’ కథేంటంటే?

Paathirathri OTT: అర్థరాత్రి ట్విస్టులతో ఉత్కంఠ రేపే కాప్ థ్రిల్లర్.. సౌబిన్ ‘పాతిరాత్రి’ కథేంటంటే?

మలయాళ వర్సటైల్ యాక్టర్ సౌబిన్ షాహిర్ నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ “పాతిరాత్రి” Paathirathri. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ‘పురు’ వంటి చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకురాలు రతీనా పి.టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా 20 ఫిబ్రవరి 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. అయితే, డబ్బింగ్ వెర్షన్‌లపై ఇంకా స్పష్టత లేదు.

“పాతిరాత్రి” అంటే ‘చీకటి’ అని అర్థం. ఆ చీకటిలో దాగి ఉన్న నైతిక సందిగ్ధతలే (ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలేని సంఘర్షణనే) ఈ సినిమా యొక్క కొర్ థీమ్. అందుకు తగ్గట్టుగానే సినిమా కథనం పూర్తిగా ఒక్కరాత్రిలో జరిగే సంఘటనలతో ఇంట్రెస్టింగ్గా ఉండనుంది. ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ లతో సినిమా కథనం ఉత్కంఠ కలిగిస్తోంది.

ఇందులో నవ్యా నాయర్ 'ఎస్ఐ జాన్సీ'గా, సౌబిన్ షాహిర్ 'కానిస్టేబుల్ హరీష్'గా కనిపిస్తారు. వీరిద్దరూ ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్నా, ఇద్దరి మధ్య భగ్గుమనేలా వైరం ఉంటుంది. ఈ క్రమంలో ఒక రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా, వీరిద్దరూ ఒక ఊహించని నేరానికి సాక్షులవుతారు. అయితే ఆ విషయాన్ని తమ పై అధికారులకు రిపోర్ట్ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడతారు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ప్రేక్షకుడి మైండ్ సెట్ని అలెర్ట్ మోడ్లో ఉంచుతుంది. 

కథేంటంటే:

“పాతిరాత్రి” కథ ఒకే ఒక్క అర్థరాత్రి సమయంలో జరుగుతుంది. సాధారణ పట్రోలింగ్ డ్యూటీగా ప్రారంభమైన సంఘటనలు, ఒక అనుమానాస్పద వ్యక్తిని అడవిలో వెంబడించడం వల్ల ఊహించని మలుపులు తిరుగుతాయి.

ఇదే సమయంలో ఒక ప్రముఖ జర్నలిస్ట్ మర్మ మరణం కేసు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. తమ నిర్ణయాలు, బాధ్యతలు, నైతిక విలువల మధ్య చిక్కుకున్న ఇద్దరు పోలీస్ అధికారులు హరీష్ మరియు జాన్సీ.. తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపే పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇలా ఈ క్రమంలో వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎలా తలకిందులు అయ్యాయి? ఆ రాత్రి వారి జీవితాల్లో మిగిల్చిన చేదు అనుభవాలు ఏంటి? అనేది సినిమా మిగతా కథ. 

విశ్లేషణ

కానిస్టేబుల్ హరీష్, SI జాన్సీ ఒకే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తుండటం, వృత్తిపరంగా ఇద్దరి మధ్య విభేదాలు, అహంభావం స్పష్టంగా చూపించడంతోనే సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. దర్శకురాలు రతీనా పి.టి కథను స్లో-బర్న్ థ్రిల్లర్ శైలిలో నడిపించారు. మొదట నెమ్మదిగా సాగిన కథ, క్రమంగా ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్‌తో ఉత్కంఠను పెంచుతుంది.

రాత్రి వాతావరణాన్ని హైలైట్ చేసే విజువల్స్ కథకు మరింత తీవ్రతను తీసుకువస్తాయి. సౌబిన్ షాహిర్ తన సహజ నటనతో పాత్రలో అంతర్లీన సంఘర్షణను బాగా చూపించారు. నవ్య నాయర్ గంభీరమైన పోలీస్ అధికారిగా ఆకట్టుకుంటారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం.

“పాతిరాత్రి” సాధారణ కమర్షియల్ థ్రిల్లర్ కాదు. ఇది మానసిక ఒత్తిడి, నైతిక సందిగ్ధతలతో నడిచే ఇన్వెస్టిగేషన్ డ్రామా. కర్తవ్యబద్ధత, నమ్మకం, నిజాయితీ మధ్య ఉండే సున్నితమైన రేఖను ఈ చిత్రం బలంగా ప్రతిబింబిస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు OTTలో ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ ని ఫీల్ అయ్యే అవకాశం ఉంది.