ఆధ్యాత్మికం : ఇవాల్టి ( ఫిబ్రవరి17)  నుంచి చైనా కొత్త సంవత్సరం ప్రారంభం.. ఈ 3 పనులు అస్సలు చేయరు చైనీయులు..!

ఆధ్యాత్మికం : ఇవాల్టి ( ఫిబ్రవరి17)  నుంచి చైనా కొత్త సంవత్సరం ప్రారంభం.. ఈ 3 పనులు అస్సలు చేయరు చైనీయులు..!

చైనీస్ నూతన సంవత్సరం (స్ప్రింగ్ ఫెస్టివల్) చంద్ర-సూర్య క్యాలెండర్ జరుపుకుంటారు.  2026లో ఫిబ్రవరి 17న ప్రారంభమై, మార్చి 3న లాంతర్ పండుగతో ముగుస్తుంది. కుటుంబ కలయికలు, ఎరుపు రంగు అలంకరణలు, బాణసంచా మరియు సాంప్రదాయ వంటకాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇది దుష్టశక్తులను పారద్రోలి అదృష్టాన్ని ఆహ్వానించేందకు చైనీయులు ఈ పండుగను జరుపుకుంటారు.  ఈ పండుగ సమయంలో  చైనీయులు మూడు పనులకు దూరంగా ఉంటారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . !

చైనీస్ నూతన సంవత్సరం అనేక పురాణాలు మరియు ఆచారాలతో ముడిపడి ఉంది. ఈ పండుగ సమయంలో చైనీయులు   పితృదేవతలను పూజిస్తారు.  అలాగే వారి కులదైవానికి కూడా పూజలు చేస్తారు. చైనా నూతన సంవత్సరం   స్ప్రింగ్ ఫెస్టివల్ ను  విభిన్న సంస్కృతులు,  ఆచారాలు , సంప్రదాయాలతో జరుపుకుంటారు.  ప్రతి సంవత్సరం ఒక జంతువు పేరుతో పిలవబడుతుంది. 2026 "గుర్రపు సంవత్సరం" (Year of the Horse) అనే పేరుతో పిలుస్తున్నారు.   ఇది సాహసం ..  చురుకుదనానికి ప్రతీక అని చైనా పండితులు చెబుతున్నారు

ఇంటిని తుడవరు:  చైనీయులు చంద్ర సూర్య క్యాలండర్​ ప్రకారం నూతన సంవత్సరం రోజ( 2026 ఫిబ్రవరి 17) ఇంటిని తుడవరు.  కనీసం చీపురు కూడా ఆరోజు అంటుకోరు.  అలా చేస్తే అర్దచంద్రాకారంలో సంపద.. అదృష్టం మొత్తం పోతుందని చైనీయులు విశ్విసిస్తారు. ఇలా చేస్తే ఆ ఏడాది అనేక విధాలుగా ఇబ్బందులు.. ఆర్థిక సమస్యలు వస్తాయని వారి నమ్మకం. అందువలన చైనా దేశస్తులు కొత్త సంవత్సరం రోజున ఇంటిని శుభ్రం చేయడాన్ని నిషేధించారని చైనీయుల పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది.   ఇంకా కిటికీలను.. తలుపులను ఎర్రటి రంగుతో.. కాగితాలతో అలంకరిస్తారు. ఇలా చేయడం వలన లైటింగ్​ కు  ఆనందం .. సంపద .. ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు.  ఇంకా ఎర్రటి కవర్​లో పెట్టి.. చైనా పండితులకు డబ్బును దానం చేస్తారు. 

తలస్నానం చేయరు..బట్టలు ఉతకరు:  చైనా పురాణాల ప్రకారం స్ప్రింగ్ ఫెస్టివల్ రోజు తలస్నానం చేయరు.. బట్టలు ఉతకరని తెలుస్తోంది.  ఇలా చేయడం వలన అదృష్టం అంతా ఆ నీటిలో కొట్టుకుపోతుందని విశ్వసిస్తారు.  చైనీస్​ సంప్రదాయం ప్రకారం జుట్టు అంటే శ్రేయస్సు అని చెబుతారు.  బట్టలు తడిపి ఉతికితే ఆ నీళ్లలో సంపద పోతుందని భావిస్తారు.  జల దేవుడి పుట్టిన రోజు అని అంటారు. అందువలన ఆరోజున నీటిని ఉపయోగించి ఎలాంటి పనులు చేయకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చైనా పండితులు చెబుతున్నారు. 

చెడు మాటలకు దూరంగా ఉంటారు:  స్ప్రింగ్ ఫెస్టివల్ సమయంలో చైనీయులు ఎలాంటి పరుష పదజాలం వాడరు.  చైనీస్​ నమ్మకాల ప్రకారంగా.. కొత్త సంవత్సరం పండుగ సమయంలో మరణం, అనారోగ్యం, నష్టం,పేదరికం వంటి పదాలను ఉపయోగించరు.  అలా మాట్లాడితే ఈ ఏడాదంతా  చెడు శక్తులు ప్రేరేపించి ఇబ్బందులు పడతారని భావిస్తారు.  ఇంకా ఈ 15 రోజులు మద్యం తాగడం.. సిగరెట్​ తాగడం వంటి వాటికి దూరంగా ఉంటారు.ఆధ్యాత్మిక ప్రసంగాలు.. దేవాలయాలను సందర్శిస్తారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.