ఇరాన్ దేశం చుట్టూ అమెరికా సైన్యం మోహరించింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ నౌకలు ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ యుద్ధ నౌకలపై యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. USS జోరాల్డ్, ఫోర్డ్, గైడెడ్ మిస్సైల్స్, అణు శక్తితో ప్రయాణించే జలాంతర్గామిలు ఇరాన్ దేశంపై దాడికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన NBC న్యూస్ ప్రకటించింది. అమెరికా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంది.. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వటమే ఆలస్యం అని అమెరికా నుంచి కథనాలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే.. ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి.
అణు బాంబుల తయారీ విషయంలో ఇరాన్ దేశంతో జరుగుతున్న చర్చలు విఫలం అయితే.. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావొచ్చు. చర్చలు సానుకూలంగా ముగుస్తాయనే ఆశ లేదని.. అందుకే అమెరికా యుద్ధానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 68 సిద్ధాంతం.. 68 యుద్ధ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. అసలు 68 యుద్ధ సెంటిమెంట్ ఆసక్తిగా మారింది.
ALSO READ : ఇరాన్ సమీపంలో అమెరికా ఫైటర్ జెట్స్..
68 యుద్ధ సెంటిమెంట్ ఏంటీ..? :
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది 1914, జూలై 28వ తేదీ : 28+7+19+14=68
రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది 1939, సెప్టెంబర్ 1వ తేదీ : 1+9+19+39=68
రష్యా దేశం ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించింది 2022, ఫిబ్రవరి 24వ తేదీ : 24+2+20+22=68
68వ తేదీ అనేది యుద్ధానికి సెంటిమెంట్ నెంబర్ .. ఇప్పుడు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత కాలంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ దేశం చుట్టూ అమెరికా సైన్యం భారీ బలగాలు, బాంబులతో మోహరించి ఉంది. ఇరాన్ దేశంతో చర్చలు ఆశాజనకంగా జరగటం లేదు. అమెరికా దేశాన్ని పాతిపెడతాం అంటూ ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఈ క్రమంలోనే యుద్ధం మొదలు అవుతుందనే బలంగా నమ్ముతున్నాయి ప్రపంచ దేశాలు. దీనికి 68 యుద్ధం సెంటిమెంట్ నెంబర్ కూడా కలిసి వస్తుంది.
ALSO READ : పెళ్లాన్ని కొట్టండి తప్పులేదు.. ఎముకలు విరక్కూడదు..
అమెరికా.. ఇరాన్ యుద్ధం ప్రారంభం అయ్యే తేదీ : 2026, ఫిబ్రవరి 20వ తేదీ : 2+20+20+26=68
ఇదంతా కాకతాళీయే అయినా.. ప్రపంచ యుద్ధాలు అన్నీ ప్రారంభం అయిన నెంబర్ 68తో.. ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధం సెంటిమెంట్ తో ముడిపడి ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
68 నెంబర్ సెంటిమెంట్ కు కొనసాగింపుగా.. మరింత బలం చేకూర్చే విధంగా మరికొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ దేశాన్ని ఎదుర్కోవటానికి అమెరికాతో కలిసి పని చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించటంతో.. ఫిబ్రవరి 20వ తేదీ యుద్ధం ప్రారంభం అవుతుందని అనటానికి బలాన్ని ఇస్తుంది.
ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం ఇదే చర్చ నడుస్తుంది. 68 అంకె సెంటిమెంట్ ఆధారంగా యుద్ధం ప్రారంభం అవుతుందని బలంగా నమ్ముతున్నారు నెటిజన్లు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య మాటల యుద్ధం.. అమెరికా సైన్యం మోహరింపు.. ఇజ్రాయెల్ రహస్య ఏర్పాట్లు.. ఇవన్నీ 20వ తేదీ యుద్ధం ప్రారంభానికి సంకేతంగా నెటిజన్లు.. ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
ఇదంతా ఇంటర్నెట్ లో.. ఆయా దేశాల్లో పెద్దగా జరుగుతున్న చర్చ.. యుద్ధం ప్రారంభం అనేదానికి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేవు. ఇదంతా ఇంటర్నెట్ లో జరుగుతున్న చర్చ.. ప్రచారం మాత్రమే..
