T20 World Cup: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు అట్టర్ ఫ్లాప్!

T20 World Cup: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు అట్టర్ ఫ్లాప్!

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న చివరి గ్రూప్– A మ్యాచ్‌లో మరోసారి టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్‌ (18) వికెట్లను భారత్ కోల్పోగా.. లోగాన్ వాన్ బీక్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడిన తిలక్ వర్మ (31) రోలోఫ్ వాన్ డెర్ మెర్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే క్రీజులో కొనసాగుతున్నారు. టీమిండియా 9 ఓవర్లు ముగిసే సమయానికి 69/3 స్కోరును సాధించింది. అభిషేక్ శర్మ తొలి ఓవర్‌లోనే జీరో రన్స్ కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రపంచ నెంబర్ వన్ T20 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్.. వరుసగా మూడు సార్లు డకౌట్‌ అయ్యాడు.


నెదర్లాండ్స్ తో జరుగుతున్న  మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇవాళ జరిగే మ్యాచ్ లో తుది జట్టులో పేసర్ అర్ష్‌దీప్ సింగ్,  ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లను తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇండియా తమ మొదటి 3 గ్రూప్ మ్యాచ్ లలో గెలిచి, సూపర్ 8 బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు, స్కాట్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని నెదర్లాండ్స్ సూపర్ –8 దశకు వెళ్లే ఆశలు ఈ మ్యాచ్‌కు ముందే అడియాసలు అయ్యాయి. పాకిస్తాన్ నమీబియా విజయం సాధించి సెకండ్ స్థానంలో నిలిచి సూపర్–8కి అర్హత సంపాదించింది. 

భారత్ జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా. 

నెదర్లాండ్స్ జట్టు: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ ( వికెట్ కీపర్/ కెప్టెన్), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్.