హైదరాబాద్, వెలుగు: మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీఏహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రెనోవా మాస్టర్స్ సూపర్ క్రికెట్ లీగ్ (ఎంఎస్‌ఎల్) సీజన్–1 టైటిల్‌ను రేజింగ్ బుల్స్ జట్టు కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో రేజింగ్ బుల్స్ 3 వికెట్ల తేడాతో సన్‌క్రెస్ట్ వారియర్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌క్రెస్ట్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రామ్ పాటిల్ 40 పరుగులతో రాణించగా, రేజింగ్ బుల్స్ కెప్టెన్ హరీష్ మూడు వికెట్లు (3/18) పడగొట్టాడు. ఛేదనలో రేజింగ్ బుల్స్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
పవన్ చెరుకూరి (47), ఓపెనర్ అబిద్ అజారుద్దీన్ (41) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నీరజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’, హరీష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు లభించాయి. వచ్చే ఏడాది నుంచి రెండు సీజన్లలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఎంసీఏహెచ్ ప్రెసిడెంట్ ఎస్పీ రెడ్డి వెల్లడించారు. బీసీసీఐ, హెచ్‌సీఏ ప్రమాణాలకు అనుగుణంగా టోర్నీని నిర్వహించామని సహాయ కార్యదర్శి గువ్వల బాలరాజ్ అన్నాడు. ముగింపు వేడుకల్లో ఎంసీఏహెచ్ ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి సునీల్రెడ్డి, కోశాధికారి రాంబాబు, ఈసీ సభ్యులు రమణ, రాకేష్, పవన్, సన్నీ, బీజేపీ నాయకుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
