హైదరాబాద్, వెలుగు: త్రిపురతో జరుగుతున్న రంజీ ట్రోఫీలో హైదరాబాద్ గెలుపు దిశగా సాగుతోంది. తనయ్ త్యాగరాజన్ (3/42), సిరాజ్ (2/19) బౌలింగ్‌లో చెలరేగడంతో.. త్రిపుర రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. శ్రీధమ్ పాల్ (25), సెంటు సర్కార్ (27 నాటౌట్) కాసేపు పోరాడటంతో.. సోమవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు త్రిపుర 33 ఓవర్లలో 99/7 స్కోరు చేసింది.
బిక్రమ్‌కుమార్ దాస్ (11), మణిశంకర్ (10)తో సహా మిగతా వారందరూ ఫెయిలయ్యారు. అంతకుముందు 121/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 103.2 ఓవర్లలో 294 రన్స్‌కు ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్ (54), రుతిక్ మెండే (61), రాహుల్ రాధేశ్ (40), చామ మిలింద్ (40) రాణించారు. సందీప్ సర్కార్ 8 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం త్రిపుర ఇంకా 61 రన్స్ వెనకబడి ఉంది.
