హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో బుధవారం వెస్టిండీస్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్ కోసం టీమిండియా హైదరాబాద్‌కు చేరుకుంది. ప్లేయర్లకు ఎయిర్‌పోర్ట్‌తో పాటు హోటల్‌లో సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఇక మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని హెచ్‌సీఏ వెల్లడించింది.
ఇప్పటివరకు మ్యాచ్‌కు సంబంధించి 25 వేల టికెట్లను విక్రయించామని తెలిపింది. స్టేడియంలో గరిష్టంగా 55 వేల మంది మ్యాచ్‌ను వీక్షించొచ్చని చెప్పింది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు. 2200 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.
‘స్టేడియం చుట్టూ నాలుగు వాచ్ టీమ్‌లు ఉంటాయి. 408 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. 8 వేల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. విమెన్స్ సేఫ్టీ కోసం ఎనిమిది షీ బృందాలు పనిచేస్తాయి’ అని సీపీ పేర్కొంది. మ్యాచ్‌కు వచ్చే వాళ్లు వీలైనంత వరకు ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
