హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ, మండలి మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ ఇది అని కొనియాడారు.
ప్రకృతిని ఆరాధించే గొప్ప వేడుక మరొక్కటి లేదన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ మామూలు పండుగ కాదని, తెలంగాణ మహిళల ఆత్మగౌరవం అని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఆరాధించే గొప్ప వేడుక బతుకమ్మ అని కొనియాడారు.
