హైదరాబాద్, వెలుగు: దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రవేశపెట్టిన స్పెషల్ బస్సులకు మంచి ఆదరణ లభిస్తుందని ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి మూడు రోజుల్లోనే ( ఈ నెల 9, 10, 11 తేదీల్లో ) 1417 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని, వీటి ద్వారా కోటి 40 లక్షల మంది ప్రయాణించారని వివరించారు.
సగటున రూ. 13. 73 కోట్ల మేర మహిళలు డబ్బులు ఆదా చేసుకున్నారని ఎండీ పేర్కొన్నారు. గతేడాది దసరా సందర్భంగా తొలి మూడు రోజుల్లోనే 922 అదనపు బస్సులు నడపడం ద్వారా మహిళలు రూ. 13.02 కోట్లను ఆదా చేసుకున్నట్లు గుర్తు చేశారు. సొంత ఊర్లకు వెళ్లేవారి కోసం 15, 16, 17 తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
