ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్: సౌతాఫ్రికా లక్ష్యం 421

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్: సౌతాఫ్రికా లక్ష్యం 421

డర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా ముందు 421 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు సోమవారం నాలుగో రోజు బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 41 ఓవర్లలో 102/4 స్కోరు చేసింది. మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (45 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), వియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. 

బెడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (46) మెరుగ్గా ఆడినా.. రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికెల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2), బవూమ (1), స్టబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1) నిరాశపర్చారు. హాజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 33/0 ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 58 ఓవర్లలో 314/6 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా (82), నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాడిసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (48), బ్యూ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (39 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (32 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (37) రాణించారు. నోర్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సఫారీలు గెలవాలంటే ఇంకా 319 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉండగా.. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 8 
వికెట్లు కావాలి.