మహిళలకు 50 శాతం సీట్లిస్తం.. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా కేటాయిస్తం: కవిత

మహిళలకు 50 శాతం సీట్లిస్తం.. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా  కేటాయిస్తం: కవిత

హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లతో సంబంధం లేకుండా తాము 50 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని టీఆర్​ఎస్​ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు, బహుజనుల కోసంపాటు పడుతున్న తనను ఆశీర్వదించాలని కోరారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసులో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ ఆఫీస్ లో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగ తెలంగాణ సొంతమన్నారు. ప్రపంచానికి చాటేలా ఈ పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు. 

ప్రతి ఒక్కరూ బతుకమ్మ పాటలు నేర్చుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలని సూచించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి బతుకమ్మ ప్రతీకగా నిలిచిందని గుర్తు చేశారు. గౌరమ్మ తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.