న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే.. విరాట్ కోహ్లీనే టాప్!

న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే.. విరాట్ కోహ్లీనే టాప్!

India vs New Zealand: అక్టోబర్ 22వ తేదీ నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ సిరీస్ కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, కివీస్ పై వన్డేల్లో అత్యంత విజయవంతమైన భారత బ్యాటర్ల రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజాల పేర్లే ముందంజలో ఉన్నాయి. న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక రన్స్ కొట్టిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నారు. టాప్-5లో ఉన్న ఇండియన్ ఆటగాళ్ల రికార్డుల వివరాలు ఇవే:

టాప్ 1లో విరాట్ కోహ్లీ: 

* న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

* కివీస్‌పై ఆడిన 36 మ్యాచ్‌ల్లో కోహ్లీ 57.48 అద్భుత సగటు, 96.63 స్ట్రైక్ రేట్‌తో 1,897 పరుగులు సాధించాడు.

* ఇందులో 7 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 154 నాటౌట్.

టాప్ 2లో సచిన్ టెండూల్కర్: 

* దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 

* న్యూజిలాండ్‌పై ఆడిన 42 మ్యాచ్‌ల్లో సచిన్ 46.05 సగటుతో 1,750 పరుగులు బాదాడు.

* ఇందులో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కివీస్‌పై అతని అత్యధిక స్కోరు 186 నాటౌట్.

వీరేందర్ సెహ్వాగ్: 

* భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. 

* కివీస్ బౌలర్లను భయపెట్టిన సెహ్వాగ్.. ఆడిన 23 మ్యాచ్‌ల్లోనే 52.59 సగటు, 103.95 తుఫాన్ స్ట్రైక్ రేట్‌తో 1,157 రన్స్ బాదేశాడు. 

* ఇందులో 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 130 పరుగులు కొట్టాడు.

రోహిత్ శర్మ: 

* భారత మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. 

* న్యూజిలాండ్‌పై ఆడిన 34 వన్డేల్లో రోహిత్ 1,134 పరుగులు సాధించాడు.

* ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 147 పరుగులు.

* మహమ్మద్ అజారుద్దీన్: 

* భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ టాప్-5 జాబితాను పూర్తి చేశాడు.

* 1980, 90ల కాలంలో కివీస్‌పై ఆడిన 40 మ్యాచ్‌ల్లో అజారుద్దీన్ 1,118 పరుగులు కొట్టాడు. 

* ఇందులో 1 సెంచరీ (108 నాటౌట్), 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.