జ్యోతిష్యం: దగ్గరగా శుక్రుడు– సూర్యుడు..15 రోజుల పాటు శుక్ర మూఢమి..ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

 జ్యోతిష్యం: దగ్గరగా శుక్రుడు– సూర్యుడు..15 రోజుల పాటు శుక్ర మూఢమి..ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. అలా శుక్ర  గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు  శుక్ర మౌఢ్యం ఏర్పడుతుంది. ఆ సమయంలో శుక్రుడు బలహీనంగా మారిపోతాయి.  

పండితులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 15 నుంచి 29 వరకు 15 రోజుల పాటు శుక్ర మూఢమి ఏర్పడుతోంది. ఈ సమయంలో   శుభ కార్యాలు చేయడం మంచిది కాదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కాని ప్రస్తుతం శుక్ర మూఢమి రోజుల్లో కూడా ఆరు  (మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకరం, కుంభం)  రాశుల వారికి పట్టింది బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. 

మేషరాశి:   సూర్యుడు.. శుక్రుడు  దగ్గరగా  ఉండటం.. ఒకే రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.  ఆదాయం పెరుగుతుంది.  మరో ముఖ్య విషయం ఏంటంటే ధనవంతుల కుటుంబంతో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది.  ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి.  వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారమై, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందడం జరుగుతుంది.. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 

కర్కాటకరాశి: ఈ రాశికి నాలుగో స్థానంలో శుక్రమూఢమి ( దగ్గరగా సూర్యుడు, శుక్రుడు) రావడంతో ధనయోగంతో పాటు రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఫైనాన్స్​ వ్యాపారం చేపే వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగంలో  ఊహించని అదృష్టం కలిగే అవకాశం ఉంది.  ఈ రాశి వారు ఎలాంటి ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడిన గల వారితో పరిచయాలు ఏర్పడుతాయి.  నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని  ఆఫర్లు అందుకుంటారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.

సింహరాశి: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర మూఢమి ఏర్పడటం.. అష్టమ శని ప్రభావం వలన చాలా వరకు ఇబ్బందులు.. కష్టాలు తొలగుతాయి. ఈ రాశి వారు శుక్రమూఢమి సమయంలో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.  ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. పూర్వీకుల ఆస్థి లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది.  గతంలో మిమ్మలను  వ్యతిరేకించిన వారు మీ సహాయం కోసం వస్తారు. వ్యాపారస్తులకు గతంలో  పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు వడ్డీతో కలిపి లాభాలు పొందుతారు. ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ సమయంలో ప్రేమను చెప్పాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

ధనుస్సు రాశి: లాభ స్థానంలో శుక్ర మూఢమి ఏర్పడటం వలన  ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. ఆస్తి విలువ పెరగడమే కాకుండా.. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్న సమస్యలు కొలిక్కివస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  గతంలో  రాదనుకున్న రాదనుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలన్నీ కొద్ది ప్రయత్నంతో చేతికందుతాయి.  ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

మకరరాశి: సూర్యుడు..శుక్రుడు ఒకే రాశిలో దగ్గరగా సంచరించడం వలన ఏర్పడిన శుక్రమూఢమి వలన ఈ రాశి  వారికి యోగ కాలమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది.  ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాల వలన లైఫ్​ టర్న్​ అవుతుంది. సాధారణ పరిస్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. ఉద్యోగ స్థిరత్వం..ఆర్థిక స్థిరత్వం  ఏర్పడే అవకాశం ఉంది.  కొత్తగా ఇల్లు కట్టాలనుకొనే వారికి శుభ సమయమని పండితులు చెబుతున్నారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది.

కుంభరాశి:  ఈ రాశికి భాగ్య స్థానంలో ఏర్పడుతున్న శుక్ర మూఢమి ఏర్పడటం వలన అంతా మంచే జరుగుతుంది.  అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి.  జీవనశైలి మారే అవకాశం ఉంది.  ఒకటి రెండు అదృష్టాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి.  ఉద్యోగస్తులు అనుకోకుండా ప్రమోషన్​ రావడం.. భారీగా వేతనం పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి.ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త బైక్, ఇంటి ప్లాట్లు కొనుగోలు చేయవచ్చు.  వ్యాపారం చేసే వ్యక్తులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.  ఉద్యోగం మారడానికి ఇదే సరైన సమయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారం బలపడుతుంది.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.