సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌పై కీలక ప్రకటన వెలువడింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా కార్మికులకు బోనస్ ప్రకటించింది. సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా కేటాయించింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,51,912 బోనస్‌గా అందనుంది. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున బోనస్ ఇవ్వనుంది
రూ.1,754 కోట్ల లాభాలు.. కార్మికులకు 34 శాతం వాటా
సింగరేణి సంస్థ మొత్తం రూ.1,754 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇందులో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా కేటాయించనున్నారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండుగ సందర్భంగా ఈ బోనస్ అందించనున్నారు.
సింగరేణి కార్మికులకు సంబంధించి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిపెండెంట్ అభ్యర్థులకు త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. కారుణ్య నియామక ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న 300 మంది కారుణ్య నియామకాలను 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో విధులకు హాజరుకాని కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.సింగరేణి కార్మికుల సంక్షేమంలో భాగంగా హౌసింగ్ కాలనీల నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. మైనింగ్ కార్యకలాపాలు లేని ప్రాంతాల్లోనూ కాలనీలను నిర్మించాలని నిర్ణయించారు. కార్మికులకు అధునాతన సౌకర్యాలతో కూడిన ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
సింగరేణిలో మారు పేర్ల సమస్యను కూడా పరిష్కరించనున్నారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.మొత్తంగా దసరా బోనస్‌తో పాటు కారుణ్య నియామకాలు, పెండింగ్ ఉద్యోగాలు, హౌసింగ్ కాలనీలు, ఇతర కార్మిక సమస్యల పరిష్కారంపై సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది.
