Beauty tips: ఆరంజ్ ఫేస్ ప్యాక్.. అందం అదరహో..

Beauty tips:  ఆరంజ్ ఫేస్ ప్యాక్.. అందం అదరహో..

అందం అంటే మగువ, మగువ అంటే అందం. అలాంటి అందాన్ని కాపాడుకోవడానికి మగువలు బయట దొరికే కాస్మోటిక్స్ వాడుతుంటారు. అలా చేయడం వల్ల చర్మం పాడైపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఆరెంజ్ఒకటి.ఇది తినడానికే కాదు ఫేస్ ప్యాక్స్‌కు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

ముఖం కాంతివంతంగా, తాజాగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఇంట్లోనే సహజ పదార్థాలతో ఫేస్‌ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆరంజ్​ ఫేస్​ ప్యాక్​, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మంచి పోషణ అందించి సహజమైన మెరుపును తీసుకురావడంలో సహాయపడతాయి.

  • ప్రస్తుతం నెలకొన్న వాతావరణానికి  చర్మం డ్రైగా, నిర్జీవంగా మారిపోతుంది. అందువల్ల ఈ సీజన్ లో చర్మం కోసం ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాలి. ఇందుకోసం ఆరెంజ్ ఫేస్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్. 
  • రెండు టీ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని, ఒక టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ తో కలపి ముఖానికి అప్లై చేయాలి. 
  • ఒక సారి డ్రైగా మారిన తర్వాత తిరిగి దానిమీద మరో సారి ప్యాక్ అప్లై చేయాలి. -
  • పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 
  • ఆ తర్వాత లైట్​ గా  మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. -
  • ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు అప్లై చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.