T20 World Cup: 11 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్.. చరిత్ర తిరగరాసిన రోహిత్, సూర్య

T20 World Cup: 11 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్.. చరిత్ర తిరగరాసిన రోహిత్, సూర్య

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 18న) జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి, గ్రూప్– A తరపున టాప్ లో నిలిచి.. సూపర్–8కి అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచింది. అంతేకాదు, టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా 12 మ్యాచ్‌లలో విజయ పరంపరను కొనసాగిస్తోంది. భారత్ చివరిసారి 2022 సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌లన్నింటినీ గెలిచి ట్రోఫీని అందుకున్న భారత్, ఇప్పుడు 2026లో ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో గెలిచింది.  

ధోనీ రికార్డు బ్రేక్:  
వన్డే– టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పేరుపై రికార్డు ఉంది. 2011 నుంచి 2015 మధ్యలో ధోనీ సారథ్యంలో భారత్ వరుసగా 11 మ్యాచ్‌లలో గెలిచింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకూ అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో పాటు 2015 వన్డే వరల్డ్ కప్‌లో కూడా లీగ్ మ్యాచ్‌లు, క్వార్టర్ ఫైనల్ కూడా గెలిచింది. అదే పరంపరను 2015 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఓటమితో ముగిసింది. ఇప్పుడు రోహిత్ శర్మ , సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ ఆ రికార్డును దాటేసింది. భారత్ చివరిసారి 2022 సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.. 2024 టీ20 వరల్డ్ కప్‌లో 8 మ్యాచ్‌లతో పాటు ట్రోఫీని గెలిచిన భారత్, ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు విజయాలుతో ధోనీ పేరుపై ఉన్న హిస్టరీని తిరగ రాసింది.  

ధోనీ పేరు ఉన్న రికార్డులు?: 
* ఐసీసీ వరల్డ్ కప్‌లలో (వన్డే + టీ20 కలిపి) అత్యధిక వరుస విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోనీ రికార్డు నెలకొల్పారు.
* 2011 నుంచి 2015 వరకు ధోనీ సారథ్యంలో భారత్ వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం.. 
* 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఓటమి లేకుండా ట్రోఫీ గెలిచిన భారత్.. 
* 2015 వన్డే వరల్డ్ కప్: ఆరు లీగ్ మ్యాచ్‌లు + క్వార్టర్ ఫైనల్ లో గెలుపు..
* 2015 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఓటమితో ముగిసిన విజయ పరంపర.. 
* ఈ అన్ని విజయాలు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనే వచ్చాయి.

11 ఏళ్ల తర్వాత రికార్డు బ్రేక్:
రోహిత్ శర్మ ప్రారంభించి, సూర్యకుమార్ కొనసాగిస్తున్న ఈ జట్టు ధోనీ రికార్డును 11 ఏళ్ల తర్వాత అధిగమించింది. వన్డే వరల్డ్ కప్‌లలో ఈ రికార్డు ఇప్పటికీ ధోనీ పేరుపైనే ఉన్నప్పటికీ.. టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం ఈ ఘనత ప్రస్తుత టీమిండియాకు దక్కింది. మొత్తం ఐసీసీ వరల్డ్ కప్‌లను కలిపి చూసుకుంటే, అత్యధిక వరుస విజయాల రికార్డు ఇప్పుడు భారత్‌దే.

ఐసీసీ ఈవెంట్స్‌లో ఎంఎస్ ధోనీ జర్నీ:  
* 2007 వన్డే వరల్డ్ కప్: తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ(ప్లేయర్‌గా)
* 2007: తొలి టీ20 వరల్డ్ కప్ విజేత (కెప్టెన్‌గా)
* 2009, 2010, 2012: టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కి చేరలేదు
* 2011: వన్డే వరల్డ్ కప్ విజేత (కెప్టెన్‌గా)
* 2013: ఛాంపియన్స్ ట్రోఫీ విజేత (కెప్టెన్‌గా)
* 2014: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి (శ్రీలంకతో)
* 2015: వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఓటమి
* 2016: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్
* 2017: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓటమి (ప్లేయర్‌గా)
* 2019: వన్డే వరల్డ్ కప్ – చివరి ఐసీసీ ఈవెంట్

భారత్ చరిత్ర సృష్టిస్తుందా?: 
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్ వైపు దూసుకెళ్తోంది. సూపర్– 8 దశలో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టాప్– 2లో నిలిస్తే సెమీఫైనల్స్‌కు అర్హత సాధించవచ్చు. మార్చి 8వ తేదీన భారత్ ట్రోఫీని గెలిస్తే.. మూడు టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన మొదటి జట్టుగా టీమిండియా నిలవనుంది. వరుసగా రెండు టైటిల్స్ గెలిచిన మొదటి జట్టుగా నిలవనుంది. (పాకిస్తాన్ ఫైనల్ ఆడకపోతే) స్వదేశంలో టైటిల్ గెలిచిన మొదటి హోస్ట్ జట్టుగా భారత్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది.