గాంధీనగర్: టీ20 వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్, టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లో డకౌటై తీవ్రంగా నిరాశ పర్చాడు.
గ్రూప్ స్టేజ్‌లో భాగంగా అమెరికా, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన ఈ టీమిండియా యంగ్ ఓపెనర్.. బుధవారం (ఫిబ్రవరి 18) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన చివరి గ్రూప్ మ్యాచులోనూ డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్లలోనే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.
తద్వారా అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఒక టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక (3) సార్లు డకౌటైన తొలి భారత ప్లేయర్‌గా చెత్త రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రా, అక్షర్ పటేల్‌తో సంయుక్తంగా ఈ జాబితాలో ఉన్న అభి.. నెదర్లాండ్స్‌పై డకౌట్ కావడం ద్వారా వాళ్లను అధిగమించి చెత్త రికార్డ్‌ను తన పేరిట మూటగట్టుకున్నాడు.
ఒకే టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధికంగా డకౌటైన ఆటగాళ్లు:
1. - అభిషేక్ శర్మ: 2026లో 3 డక్‌లు
2. - ఆశిష్ నెహ్రా: 2010లో 2 డకౌట్లు
3. - విరాట్ కోహ్లీ: 2024లో 2 డకౌట్లు
4. - అక్షర్ పటేల్: 2026లో 2 డక్‌లు
