నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ మూసేయండి..మరోసారి పంజాగుట్ట PSలో కరాటే కళ్యాణి ఫిర్యాదు

నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ మూసేయండి..మరోసారి పంజాగుట్ట PSలో కరాటే కళ్యాణి ఫిర్యాదు

 యూట్యూబర్ అన్వేష్ ను  వదలొద్దని ఎక్కడున్నా పట్టుకోవాలన్నారు సినీ నటి కరాటే కళ్యాణి . హిందూ దేవుళ్లు, మతాలు, కులాలపై చిచ్చుపెడుతోన్న అతను తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం దౌర్భాగ్యమని ఫైర్ అయ్యారు. జనవరి 4న  మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యూ ట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు చేశారు కళ్యాణి.  అన్వేష్  పైన నమోదైన FIR లో మరో యాక్ట్ ను  పొందుపరచాలని ఫిర్యాదు చేశారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పీఎస్ కు వచ్చారు కళ్యాణి.

ప్రస్తుతం ఉన్న ఐటి యాక్ట్ 67 తో పాటు 69A సెక్షన్ ని కూడా FIR లో పొందుపరచాలని కోరారు కళ్యాణి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని పోలీసులకి  సమర్పించారు. ఈ యాక్ట్ ద్వారా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ని బ్లాక్ బ్లాక్ చేయించాలని కంప్లైంట్ చేశారు. నా అన్వేషణ  పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ ని ముసివేసేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం అంతా ఏ అకౌంట్లోకి వెళ్తున్నాయో ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని BNS సెక్షన్ 106 ను  పొందుపరచాలని ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణి. 

►ALSO READ | ప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు..బీచ్ లలో రోబోటిక్ లైఫ్ బాయ్స్

స్త్రీల వస్త్రధారణ విషయంలో టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న వివాదంపై స్పందిస్తూ.. హిందువులు దేవతగా కొలిచే సీతా దేవి గురించి యూట్యూబర్ అన్వేష్ జుగుప్సాకరంగా మాట్లాడాడు. ద్రౌపది దేవి గురించి కూడా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడని.. అతనిని ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.