ప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు..బీచ్ లలో రోబోటిక్ లైఫ్ బాయ్స్

ప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు..బీచ్ లలో రోబోటిక్ లైఫ్ బాయ్స్

ఏపీలోని బీచ్ లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ పట్నం బీచ్ లలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీచ్ లలో నీటిలో మునిగిపోకుండా, ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు విశాఖ పట్నం పోలీసులు చర్యలు చేపట్టారు.  ప్రమాదంలో ఉన్న వారిని  రక్షించేందుకు రిమోట్ ద్వారా ఆపరేటింగ్ చేసే రోబోటిక్ లైఫ్ బాయ్ లను రంగంలోకి దింపుతున్నారు. 

బీచ్ లలో ప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు, సముద్రంలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలను నివారించే లక్ష్యంతో విశాఖపట్నం పోలీసులు త్వరలో నగర బీచ్ లలో రోబోటిక్ లైఫ్ బాయ్ లను దించేందుకు సిద్దమయ్యారు. నగరంలోని YMCA సమీపంలోని RK బీచ్ లో సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక బ్రాతా బాగ్చి రోబోటిక్ లైఫ్ బాయ్ తో ట్రయల్ రన్ వేశారు. ఈ రోబోటిక్ లైఫ్ బాయ్ పనితీరును పరిశీలించారు. 

Also Read : ఈ యాప్తో రూట్లన్నీ ట్రాక్ చేయొచ్చు

ఈ రోబోను రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఆపదలో ఉన్న వ్యక్తులను రక్షించేందుకు సముద్రంలోకి దాదాపు అరకిలోమీటర్ దూరం వరకు ప్రయాణించవచ్చు. అప్పికొండ , భీమిలి బీచ్ల మధ్య 16 ప్రదేశాలలో మునిగిపోయే సంఘటనలు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. అన్ని వ్యూహాత్మక ప్రదేశాలలో ఈ రోబోటిక్ లైఫ్ బాయ్ లను మోహరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అక్కడ బీచ్ భద్రతకు శిక్షణ పొందిన లైఫ్ గార్డులు ఈరోబోలను నిర్వహిస్తారు.