కాకినాడలో పేలిపోయిన టపాసుల ఫ్యాక్టరీ : 18 మంది స్పాట్ డెడ్.. మరో 15 మంది డౌట్..!

కాకినాడలో పేలిపోయిన టపాసుల ఫ్యాక్టరీ : 18 మంది స్పాట్ డెడ్.. మరో 15 మంది డౌట్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం. కాకినాడ జిల్లా సమార్లకోట మండలం వేట్లపాలెంలో.. పొలాల మధ్య ఉన్న టపాసుల తయారీ ఫ్యాక్టరీ పేలిపోయింది. 2026, ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం సమయంలో.. సూర్యశ్రీ టపాసుల ఫ్యాక్టరీలో 35 మంది వర్కర్లు.. టపాసులు తయారు చేస్తున్నారు. టపాసులు తయారు చేస్తున్న సమయంలో.. అనుకోకుండా మంటలు వచ్చాయి. అప్పటికే ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో టపాసులు ఉండటం.. మందు గుండు సామాగ్రి నిల్వ ఉండటంతో.. ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. 

నిల్వ ఉన్న టపాసులతోపాటు.. టపాసుల తయారీకి సిద్ధం చేసిన పేలుడు మందుతో... ఆ ప్రాంతం అంతా అగ్నిగోళంగా మారింది. పేలుడు ధాటికి టపాసుల ఫ్యాక్టరీ నేల మట్టం అయ్యింది. 
ఫ్యాక్టరీలో పని చేస్తున్న 35 మంది కార్మికుల్లో.. 18 మంది స్పాట్ లోనే చనిపోయారు. పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు తెగిపడ్డాయి. మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో నరకయాతన పడుతున్న బాధితులను.. అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.