భద్రాచలం మిథిలా స్టేడియంలో నిత్య కల్యాణాలు ..ఆలయ అభివృద్ధి పనులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

భద్రాచలం మిథిలా స్టేడియంలో నిత్య కల్యాణాలు ..ఆలయ అభివృద్ధి పనులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మిథిలాస్టేడియంలో నిత్య కల్యాణాలు షురూ అయ్యాయి. రామాలయం అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఆలయంలోని బేడా, ప్రాకార మండపాల్లో నిత్య కల్యాణాలు జరిగేవి. 

ప్రస్తుతం గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకారాలను తొలగిస్తున్నారు. దీంతో భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాటు చేశారు. శనివారం ఈవో దామోదర్​రావు, స్థానాచార్యులు స్థలసాయి, వేదపండితులు, అర్చకులు తలంబ్రాలతో మిథిలా స్టేడియానికి చేరుకొని మండపాన్ని శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తొలి రోజు నిత్య కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.