తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మామండూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం కన్నీళ్లు తెప్పింది. రెండు కార్లు ఢీకొన్న యాక్సిడెంట్.. అత్యంత ఘోరంగా ఉంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లి.. శివయ్య దర్శనం చేసుకుని తిరిగి మళ్లీ హైదరాబాద్ వస్తున్న క్రమంలో జరిగింది ఈ ప్రమాదం.
మామండూరు జాతీయ రహదారిపై.. వేగంగా వెళుతున్న ఓ కారు.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఆ సమయంలో హైదరాబాద్ కు చెందిన కారు పల్టీలు కొడుతూ.. రోడ్డుకు అవతలి వైపున పడింది. కారు పల్టీలు కొడుతూ వెళ్లటంతో.. కారులోని ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చనిపోయారు. వీళ్లిద్దరూ భార్యభర్తలు. వీరిని అశోక్, చంద్రకళగా గుర్తించారు పోలీసులు.
మిగతా నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వాళ్లకు గాయాలు తీవ్రంగా ఉన్నాయని డాక్టర్లు స్పష్టం చేశారు. అరుణాచలం నుంచి తిరిగి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ఈ యాక్సిడెంట్ అయినట్లు చెబుతున్నారు గాయపడిన బాధితులు. యాక్సిడెంట్ స్పాట్ భయానకంగా ఉంది. పెద్ద కారు పల్టీలు కొడుతూ రోడ్డుకు అవతలివైపు పడటం అంటే.. కార్లు ఏ స్పీడ్ లో ఉన్నాయని తెలుస్తుందన్నారు పోలీసులు. మరో కారు ఢీకొనటం వల్ల ఈ యాక్సిడెంట్ అయ్యింది అంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి.. తప్పు ఎవరిది అనేది తేలుస్తామని ప్రకటించారు పోలీసులు.
