హైదరాబాద్లోని ఈ మటన్ షాప్లో.. సీక్రెట్గా గొర్రెలు, మేకల బ్లడ్ తీస్తున్నారు.. ఆ బ్లడ్తో ఏం చేస్తున్నారంటే..

హైదరాబాద్లోని ఈ మటన్ షాప్లో.. సీక్రెట్గా గొర్రెలు, మేకల బ్లడ్ తీస్తున్నారు.. ఆ బ్లడ్తో ఏం చేస్తున్నారంటే..

మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న సోను చికెన్ అండ్ మటన్ షాప్లో మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారనే సమచారం అందుకున్న పోలీసులు సోనూ మటన్ షాప్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో షాప్ యజమాని సుందర్ సోను, అతని దగ్గర పనిచేసే అఖిల్.. ఈ ఇద్దరూ గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తూ, ఆ రక్తాన్ని 130 బ్యాగ్లలో నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.

ఇలా సేకరించిన రక్తాన్ని కాచిగూడలో CNK ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు విక్రయించి, ల్యాబొరేటరీలలో ఉపయోగించే షీప్ బ్లడ్ ఆగర్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఈ కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జీహెచ్ఎంసీ అధికారులకు మరియు వెటర్నరీ డిపార్ట్మెంట్కి అప్పగించడం జరిగింది. 

మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ అరెస్ట్ చేశారు.180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ రక్తంతో ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి, కొన్ని వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారని సమాచారం. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరించడం వల్ల అవి ఒక రోజు తర్వాత చనిపోతాయని.. ఇది చట్ట విరుద్ధమైన చర్య అని వెటర్నరీ అధికారులు చెప్పారు. గొర్రెలు, మేకల రక్తం సేకరిస్తున్న ఈ ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.