కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ మూడ్ విద్యార్థుల సమస్యలపై ఆరా 

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ మూడ్ విద్యార్థుల సమస్యలపై ఆరా 

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ మూడ్ మంగళవారం పాల్వంచ డివిజన్ కేంద్రంలో పర్యటించారు. స్థానిక జ్యోతి నగర్ జ్యోతిబాపూలే బాలిక గురుకులాన్ని కార్పొరేటర్ కీర్తితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి టిఫిన్​ చేస్తూ, వారి సమస్యలపై ఆరా తీశారు.

అనంతరం పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో డ్రైనేజీ పనులను పరిశీలించి, డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టిని తీశారు. 44వ డివిజన్ లో ఆక్రమణకు గురైన మేడికుంట చెరువును పరిశీలించారు. కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు తోకలిసి సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.