మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మూడు మహిళా సంఘ భవనాలకు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్, సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ .. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఈరోజు మహిళా భవనాలకు శంకుస్థాపన చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాము. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది .కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకే అధిక పథకాలు ఇవ్వడం జరిగింది. జైపూర్ మండలంలో 753 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగింది. మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుంది. ఇక్కడ మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా వచ్చే నెలలో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. పవర్ ప్లాంట్ లో ల్యాండ్ అక్విజేషెన్ ఇచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం కల్పిస్తాం. రాష్ట్రంలో ప్రతీ అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చెన్నూరు నుంచి హైదరాబాద్ కు మరో బస్సును ఈ నెలలో ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ పథకం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుదాం. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తుంది అని అన్నారు.
