హుజూరాబాద్, వెలుగు: ఎన్నికల వరకే రాజకీయమని, ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రొంటాల సుహాసిని, వైస్ చైర్‌పర్సన్‌గా గూడూరి అంజలి, పాలకవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. హుజూరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి సహకారిస్తానన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే మున్సిపల్‌లో రూ.15 కోట్లు ఉన్నాయని, మరో రూ.300 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత రాజకీయాలు మరిచిపోవాలని సూచించారు. హుజూరాబాద్‌లో 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలిచిందని, అందుకే నిధుల కేటాయింపులో ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
