వరుస ఆఫర్స్.. భారీ రెమ్యునరేషన్.. ఇది త్రిష రూలింగ్

వరుస ఆఫర్స్.. భారీ రెమ్యునరేషన్.. ఇది త్రిష రూలింగ్

త్రిష(Trisha) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు దాటినా ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ప్రెజెంట్ హీరోయిన్స్ కు టఫ్ ఫైట్ ఇస్తోంది. అంతేకాదు రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే అందుకుంటోంది. ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం అయినా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటోంది అంటే మాములు విషయం కాదు. తనతో పాటు వచ్చిన హీరోయిన్స్ అందరూ దాదాపు తట్టా బుట్టా సద్దేసారు. కానీ త్రిష మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటోంది.

ఇక తాజాగా మరో భారీ ఆఫర్ కు సైన్ చేసింది ఈ బ్యూటీ. స్టార్ డైరెక్టర్ మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో ఒక భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. KH234  వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ ను సెట్ చేస్తున్నారు దర్శకుడు మణిరత్నం. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు లోకి త్రిషను తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

అంతేకాదు ఈ సినిమా కోసం త్రిషకు రూ.12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త గనుక నిజమైతే.. సీనియర్ హీరోయిన్స్ లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గ త్రిష రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మారే స్టార్ హీరోయిన్ తన దరిదాపుల్లోకి కూడా రావడం కష్టమే. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.