ఇద్దరు పిల్లలపై కత్తితో తల్లి దాడి..కూతురు మృతి, స్వల్ప గాయాలతో  తప్పించుకున్న కొడుకు

ఇద్దరు పిల్లలపై కత్తితో తల్లి దాడి..కూతురు మృతి, స్వల్ప గాయాలతో  తప్పించుకున్న కొడుకు
  • మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తల్లి
  • భువనగిరి జిల్లాలో దారుణం

యాదాద్రి, వెలుగు : మానసిక సమస్యకు తోడు పిల్లలు దూరం అవుతున్నారన్న బాధతో ఓ మహిళ ఇద్దరు పిల్లలపై కత్తితో దాడి చేసింది. కూతురు చనిపోగా కొడుకు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అనంతరం మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబ సభ్యులు కాపాడారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బీబీనగర్‌‌‌‌ మండలం జైనపల్లికి చెందిన నరేందర్‌‌‌‌రెడ్డికి 15 ఏండ్ల కింద భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన రత్నకళ (నీలిమ)తో వివాహమైంది. వీరికి కూతురు కృతి (14), కుమారుడు అక్షిత్‌‌‌‌ ఉన్నారు. రత్నకళ కొన్ని రోజులుగా యూట్యూబ్‌‌‌‌లో ఆహారం, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూస్తోంది. 

ఈ క్రమంలో ఆహార అలవాట్లను మార్చుకోవాలని, నూనె వస్తువులు తినకూడదంటూ కుటుంబ సభ్యులను కట్టడి చేయడంతో పాటు చెప్పిన విషయాలనే మళ్లీమళ్లీ చెబుతూ ఉండేది. దీంతో ఇబ్బందికి గురైన ఇద్దరు పిల్లలు తండ్రి నరేందర్‌‌‌‌రెడ్డితోనే ఎక్కువగా గడుపుతుండడంతో పిల్లలు తనకు దూరం అవుతున్నారని భావించేది. ఈ క్రమంలోనే నరేందర్‌‌‌‌రెడ్డి భార్య రత్నకళతో పాటు, కూతురు, కుమారుడిని శనివారం రాత్రి అత్తగారింట్లో వదిలి వెళ్లాడు. 

ఇద్దరు పిల్లలతో కలిసి గదిలో పడుకున్న రత్నకళ ఆదివారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న కత్తితో కూతురు కృతి మెడ వెనుక, ముందు భాగంలో పలుమార్లు పొడవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అక్షిత్‌‌‌‌ నిద్ర లేవడాన్ని గమనించిన  రత్నకళ అతడిని సైతం కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడంతో స్వల్ప గాయమైంది. దీంతో భయపడిన అక్షిత్‌‌‌‌ తల్లి నుంచి తప్పించుకొని తలుపు తీసుకొని బయటకు పరుగెత్తాడు. 

వెంటనే తలుపులు మూసేసిన రత్నకళ ఉరి వేసుకుంది. బయటకు వెళ్లిన అక్షిత్‌‌‌‌ విషయాన్ని తన మామ మహేందర్‌‌‌‌రెడ్డికి చెప్పడంతో కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు పగులకొట్టి రత్నకళను కిందికి దించారు. గాయపడిన అక్షిత్‌‌‌‌ను, అపస్మారక స్థితిలో ఉన్న రత్నకళను హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. 

14 నెలల శిశువును హత్య చేసిన తల్లి

మెహిదీపట్నం, వెలుగు : కుటుంబ కలహాలతో ఓ తల్లి తన 14 నెలల కూతురిని హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌‌‌‌లోని గోల్కొండ పీఎస్‌‌‌‌ పరిధిలో ఆదివారం జరిగింది. గోల్కొండ రిసాల బజార్‌‌‌‌కు చెందిన అమీర్‌‌‌‌ అలీ, గౌసియాబేగం ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఉమ్మె ఐమాన్‌‌‌‌ (14 నెలలు) కూతురు ఉంది. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో గౌసియా బేగం ఆదివారం సాయంత్రం దిండుతో ఊపిరి ఆడకుండా చేసి కూతురిని చంపేసింది. గౌసియా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.